విలేకరులమని చెప్పి అక్రమవసూళ్లకు పాల్పడుతున్న ఐదుగురిని హైదరాబాద్ ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల ఏడున ఆర్వై ఫ్యామిలీ స్పా సెంటర్కు సురేందర్ రాజు, ఎస్. కిరణ్ కుమార్, టి. రఘునాథ చారి, రాజా కిషన్, బి. రవి అనే వ్యక్తులు వచ్చి తాము విలేకరులను నమ్మించారు. నగరంలోని ఓ స్పా సెంటర్లో రూ. 50 వేలు వసూలు చేశారు. నిందితులు అంబర్ పేట, గాజులరామారం, బాలాపూర్, కాచిగూడ, ఘట్కేసర్ ప్రాంతాలకు చెందినట్లు పోలీసులు గుర్తించారు. స్పా యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు.
ఇదీ చూడండి: వరంగల్లో నలుగురు నకిలీ మావోయిస్టుల అరెస్ట్