ETV Bharat / state

Viral News : భర్త చనిపోయినట్టు ఫేక్ పోస్ట్.. అది చూసి భార్యకు షాక్.. చివరికి ఏమైదంటే

Fake Posting in Social Media : సామాజిక మాధ్యమాల్లో చేసిన తప్పుడు పోస్టు ఓ మహిళకు ప్రాణాపాయ స్థితికి తెచ్చింది. ఓ వ్యక్తి బతికి ఉండగానే చనిపోయినట్లు మరో వ్యక్తి పోస్ట్ చేయటంతో అతని భార్య షాక్‌కి గురై కుప్పకూలింది. ఇదెక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

SOCIAL MEDIA
SOCIAL MEDIA
author img

By

Published : Jul 10, 2023, 9:57 PM IST

Fake Posting in Social Media at Man Died : నేటికాలంలో చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉండటం సర్వసాధారణంగా మారింది. నిమిషం వృథా చేయకుండా నెట్టింట్లో గడపాల్సిందే అనేంతగా పరిస్థితి మారిపోయింది. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచంలో ఎక్కడా ఏమూల ఏం జరిగినా తెలుస్తోంది. ఇందులో కొన్ని వాస్తవాలు.. మరికొన్ని అవాస్తవాలు ఉంటున్నాయి. కానీ అసత్య వార్తలకు, విద్వేషపూరిత కథనాలకు సామాజిక మాధ్యమాలు వేదికలవుతుండటం ఆందోళన కలిగించే విషయంగా పరిణమించింది.

ఈ క్రమంలోనే కొందరైతే సోషల్ మీడియాలో ఫాలోయర్స్​ను పెంచుకునేందుకు విచిత్రమైన పోస్ట్ పెడుతుంటారు. మరికొందరు ఇంకో ముందడగు వేసి పాపులారిటీ కోసం సెలబ్రెటీలు బతికి ఉండగానే మరణించినట్లు తప్పుడు పోస్ట్​లు చేస్తున్నారు. ఇది నిజమో అబద్ధమో తెలుసుకోకుండానే చాలా మంది వాటికి కామెంట్స్ పెడుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. చివరకు సదరు సెలబ్రెటీ తిరిగి తాను చనిపోలేదని.. బతికే ఉన్నానని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిదంటే సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

Secunderabad Viral News : ఇప్పుడు తాజాగా ఇలాంటి పరిస్థితే సికింద్రాబాద్​లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బతికి ఉండగానే చనిపోయినట్లు.. మరో వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటన అల్వాల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సికింద్రాబాద్ మచ్చబొల్లారంలో నివాసం ఉండే గణేశ్‌.. అతని బంధువు అనిల్‌ మధ్య ఆర్థిక వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే గణేశ్‌ తన స్నేహితులతో కలిసి శ్రీశైలంకు వెళ్లాడు. ఇందులో భాగంగా అతని ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయింది. ఇదే అదనుగా భావించిన అనిల్‌.. గణేశ్‌ చనిపోయినట్లు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు.

Hyderabad Latest News : సోషల్ మీడియాలో ఈ పోస్ట్​ను చూసిన గణేశ్‌ భార్యకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తనపై తప్పుడు పోస్టింగ్​లు పెట్టిన అనిల్‌పై గణేశ్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఇప్పటికే తన భార్యకు ఒకసారి గుండెపోటు వచ్చిందని.. ఇది రెండోసారి అని బాధితుడు గణేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"స్నేహితులతో కలిసి శ్రీశైలం వెళ్లాను. మా బంధువు అనిల్ నేను చనిపోయినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చూసి నా భార్య ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇప్పటికే ఆమె ఒకసారి గుండెపోటు వచ్చింది. నాపై సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్ట్ చేసిన అనిల్​పై పోలీసులకు ఫిర్యాదు చేశాను." - గణేశ్, బాధితుడు

ఇవీ చదవండి: సోషల్​మీడియా వేదికగా.. పేదలకు అండగా

ఫేస్​బుక్​లో ఫేక్​ ప్రొఫైల్స్​తో విసిగిపోతున్నారా? వాటికి చెక్​ పెట్టండిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.