ETV Bharat / state

సామాజిక మాధ్యమాలే వేదికగా తప్పుడు సమాచారం... పోలీసుల నిరంతర నిఘా - fake news

తప్పుడు వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు సోషల్‌ మీడియా వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. కొన్నిసార్లు విద్వేషాలు రగిలిస్తున్నాయి. ఒకరి మనోభావాలను దెబ్బతీయాలనో.. వ్యక్తిగతంగా కించపరచాలనో సామాజిక మాధ్యమాన్ని వేదికగా చేసుకుంటున్న కొందరు.. అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరు ఎప్పుడో జరిగిన ఘటనను తాజాగా చూపిస్తూ.. పాత ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ.. లేనిపోని సమస్యలను సృష్టిస్తున్నారు. అలాంటి వారిపై పోలీసులు నిరంతరం నిఘా పెట్టారు.

fake news spread in social media
సామాజిక మాధ్యమాలే వేదికగా తప్పుడు సమాచారం... పోలీసుల నిరంతర నిఘా
author img

By

Published : Nov 4, 2020, 1:12 PM IST

‘‘హైదరాబాద్‌లో భారీ వర్షాలకు వరద నీటిలో కొట్టుకుపోయిన 15 మంది వ్యక్తులు.. వారి జాడ కోసం గాలిస్తున్న పోలీసులు’’

‘‘దసరా పండుగ సందర్భంగా అక్టోబరు 26 కూడా సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం’’

‘‘దుబ్బాకలో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి తెరాసలో చేరుతున్నారు.. ఇందుకు నిర్ణయం జరిగిపోయింది’’

సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్‌... వాట్సాప్‌లలో వైరల్‌ అయిన వార్తలివి.. వాస్తవానికి ఇవన్నీ సత్యదూరమైన వార్తలు. ఈ వీడియోలన్నింటినీ నిమిషాల్లోనే వేలమంది చూశారు. కొందరు సైబర్‌ నేరస్థులు కావాలనే ఇలా అసత్యాలను వార్తలుగా చేసి సామాజిక మాధ్యమాల్లో పంపుతున్నారు. ఇటీవల ఈ ధోరణి పెరిగిందని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. వీటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్​ నగరంలోని మూడు పోలీసు కమిషనరేట్లలో ఇలాంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ద్వారా అసత్యవార్తలు, తప్పుడు కథనాలు పంపుతున్నారు. పాత చిత్రాలు, దృశ్యాలు, విదేశీ వీడియోలను తీసి వాటికి వ్యాఖ్యానాలు జోడిస్తున్నారు. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగే వార్తలు, కథనాలపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారని సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.

ఇవీ చూడండి: నైజీరియన్ల నయా మోసాలు... కొత్త పంథాల్లో సైబర్​ నేరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.