ఓ ఎన్ఆర్ఐ మహిళపై అత్యాచారం చేసి... ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేసిన వ్యక్తులను హైదరాబాద్ బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విదేశాల నుంచి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళతో ఫేస్బుక్లో అడ్వకేట్ సంజీవ రెడ్డి దంపతులు పరిచయం పెంచుకుని... ఆమెను కూకట్‌పల్లిలోని ఓ రెస్టారెంట్లో భోజనానికి ఆహ్వానించారు.
రెస్టారెంట్‌కు వెళ్లిన ఆమె అక్కడ భోజనం చేయకపోవటంతో... శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఆమెను బాచుపల్లిలోని సంజీవరెడ్డి ఇంటికి తీసుకెళ్లి అసభ్యకర వీడియోలు, చిత్రాలు చిత్రీకరించారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని నిందితులు బెదిరింపులకు పాల్పడ్డారు. నిస్సహాయ స్థితిలో ఎన్నారై మహిళ రూ. 50 లక్షల నగదు, బంగారాన్ని నిందితులకు అందించింది.
మేనల్లుడు విశాల్‌తో కలిసి సంజీవ రెడ్డి దంపతులు ఇంకా డబ్బులివ్వాలంటూ వేధించటంతో... బాధితురాలు బాచుపల్లి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను బీదర్‌లో అదుపులోకి తీసుకుని విచారించి... రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చూడండి: 'ఐదుగురికి ఉరిశిక్ష వేయడం అభినందనీయం'