యూపీఎస్సీ తరహాలో ఉద్యోగాల క్యాలెండర్: జనార్దన్‌రెడ్డి - టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి వార్తలు
ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే వారికి ప్రతిభ, ప్రజా సేవ చేయాలన్న దృక్పథం కచ్చితంగా ఉండాల్సిందేనని టీఎస్పీఎస్సీ నూతన ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పైరవీలకు తావు లేని పారదర్శక విధానాలను అమలు చేస్తానని తెలిపారు. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగాల క్యాలెండర్ చాలా అవసరమని.. ఆ దిశగా ప్రయత్నిస్తానని చెప్పారు. నియామక ప్రక్రియలో జాప్యం, సాంకేతిక సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయో అధ్యయనం చేసి.. లోపరహిత వ్యవస్థను తీర్చిదిదుతానని స్పష్టంచేశారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌గా రేపు బాధ్యతలు స్వీకరించబోతున్న జనార్దన్‌రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.