ETV Bharat / state

కంకులు కుళ్లిపోయాయి... గింజలు రాలిపోయాయి - Extent of Crop Damage from Heavy Rains

నైరుతి రుతుపవనాలు చాలా ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి. జూన్​లో కురవాల్సిన వర్షాలు జులై మూడో వారం వరకు రాలేదు. అప్పుడు వర్షాల కోసం ఎదురు చూసిన రైతులు... వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని నానా కష్టాలు పడి ఖరీఫ్‌ పంటలను సాగుచేస్తే ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలు వాటిని నాశనం చేస్తున్నాయి.

భారీ వర్షాలతో పంటలకు నష్టం
author img

By

Published : Oct 25, 2019, 5:56 AM IST

భారీ వర్షాలతో పంటలకు నష్టం

శీతాకాలంలో కురుస్తున్న భారీ వర్షాలు పైర్లను కబళిస్తున్నాయి. చేతికొచ్చే దశలో, పూతతో నిండుగా ఉన్న పంటపై కురుస్తున్న వానలు రైతులకు కన్నీరు మిగుల్చుతున్నాయి. రాష్ట్రంలో ఖరీఫ్‌ దశలో మొత్తం కోటీ 11 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా వాటిలో ఇప్పటివరకు పదో వంతు కోతలు కూడా పూర్తికాలేదు.
నేలరాలిపోయిన ప్రధాన పంట
ఖరీఫ్​లో పత్తిని ప్రధాన పంటగా 46 లక్షల ఎకరాల్లో రైతులు వేశారు. వానలు లేక మొదట్లో కాస్తా ఇబ్బంది పెట్టినా దిగుబడులు బాగానే ఉన్నాయని రైతులు సంతోషపడే సమయంలో... వర్షాలు వచ్చి దుఖాన్ని మిగులుస్తున్నాయి. గాలివానకు చాలావరకు పత్తికాయలు రాలిపోతున్నాయి. మిగిలిన కాయలు నల్లగా మాడిపోతున్నాయి. వాటి నుంచి వచ్చే పత్తి నాణ్యత లేని గుడ్డిపత్తి అంటూ వ్యాపారులు ధరలను తెగ్గోస్తున్నారు. ఈ సీజన్‌లో పత్తి పంట మద్ధతు ధర క్వింటాకు 5550 కాగా... ప్రస్తుత పరిస్థితిలో క్వింటాకు 3 వేల నుంచి 5 వేలు రావడమే గగనమవుతుంది.
తాలుగింజలతో దిగుబడులు ఎలా?
మొక్కజొన్న కంకుల్లో నీరు చేరి కుళ్లిపోతున్నాయి. సోయాగింజలు రాలిపోతున్నాయి. వరిపైరు నేలవాలుతోంది. పొట్టదశకు వచ్చినందున తాలు గింజలు ఏర్పడి దిగుబడులు తగ్గుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారీ కాదు... అతి భారీవర్షాలు
సాధారణంగా 5 సెంటీమీటర్లకు మించి వర్షం కురిస్తే భారీగా పడినట్లుగా వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. కానీ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 20 సెంటీమీటర్ల దాకా వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల పరకాలలో 24 గంటల వ్యవధిలోనే అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా అక్టోబరు రెండోవారంలో అత్యధిక రికార్డు నమోదు చేశాయని వాతవరణశాఖ తెలిపింది. ఈ స్థాయి వర్షాలకు పైర్లు నిలువునా నేలకొరిగిపోతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో రైతులు బాగా నష్టపోయారు. నష్టాలపై అంచనా ఏమీ వేయలేదని జిల్లా వ్యవసాయాధికారి తెలిపారు.
పంటచేలలో నీరు నిలిచి మునిగిపోతే నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అధ్యయనం చేస్తుందే తప్ప... వాటికి పరిష్కార మార్గాలు చూపించడంలో మాత్రం అలసత్వం వహిస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి: సాగర్​కు భారీ వరద..18 గేట్లు ఎత్తివేత

TG_HYD_01_24_CROPS_DAMAGE_PKG_3182061 రిపోర్టర్‌: జ్యోతికిరణ్‌ NOTE: అదిలాబాద్‌, ఇతర జిల్లాల నుంచి వచ్చిన పంటనష్టంఫైల్‌ విజువల్స్‌, బైట్స్‌ వాడుకోగలరు ( ) శీతాకాలంలో కురుస్తున్న భారీ వర్షాలు పైర్లను కబళిస్తున్నాయి. పలు పైర్లు చేతికొచ్చే దశలో పూత, కాతతో నిండుగా ఉంటే వాటిపై కురుస్తున్న వానలు రైతులకు కన్నీరు మిగుల్చుతున్నాయి. గత జూన్‌లో నైరుతి రుతుపవనాలు చాలా ఆలస్యంగా రాష్ర్టంలోకి ప్రవేశించాయి. జూన్‌లో వర్షాలు కురవాల్సిందిపోయి జులై మూడో వారం దాకా పడలేదు. అప్పుడు వర్షాల కోసం కళ్లు కాయలు కాచేలా రైతులు ఎదురుచూసినా ఫలించలేదు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని నానా కష్టాలు పడి ఖరీఫ్‌ పంటలను సాగుచేస్తే ఇప్పుడు పడుతున్న భారీ వర్షాలు వాటిని నాశనం చేస్తున్నాయి.............LOOK VO.1: ఖరీఫ్‌లో మొత్తం కోటీ 11 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా వాటిలో ఇంతవరకూ పదో వంతు కూడా కోతలు పూర్తికాలేదు. ప్రధాన పంట పత్తి 46 లక్షల ఎకరాల్లో వేయగా తొలిసారి దూది తీయడం ప్రారంభమవుతోంది. పత్తి కాయలపై వానలు పడుతున్నందున చాలా వరకు రాలిపోతున్నాయి. మిగిలిన కాయలు నల్లగా మాడిపోతున్నాయి. వాటి నుంచి వచ్చే పత్తి దూది నాణ్యత లేక గుడ్డిపత్తి అని వ్యాపారులు ధర తెగ్గోస్తున్నారు. దీనివల్లనే ప్రస్తుతం మార్కెట్లకు వస్తున్న పత్తి పంటకు క్వింటాకు 3 వేల నుంచి 5 వేలలోపే ధర చెల్లిస్తున్నారు. ఈ సీజన్‌లో పత్తి పంట మద్ధతు ధర క్వింటాకు 5550కాగా అది రైతులకు రావడంలేదు. దూదిలో తేమ అధికంగా ఉంటున్నందున మద్ధతు ధర రావడం లేదని మార్కెటింగ్‌ శాఖ అధికారులు తెలిపారు. వర్షాల వల్ల నష్టం అధికంగా ఉందని అధికారులు సైతం వివరించారు. మొక్కజొన్న కంకుల్లో నీరు చేరడంలో కుళ్లిపోతున్నాయి. సోయాగింజలు రాలిపోతున్నాయి. వరిపైరు నేలవాలుతోంది. పొట్టదశకు వచ్చినందున తాలుగింజలు ఏర్పడుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు...........SPOT VO.2: సాధారణంగా 5 సెంటీమీటర్లకు మించి వర్షం కురిస్తే భారీగా పడినట్లుగా వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. కానీ రాష్ర్టంలోని కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 20 సెంటీమీటర్ల దాకా వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల పరకాలలో 24 గంటల వ్యవధిలోనే 19 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత పదేళ్లలో అక్టొబరు నెల రెండో అత్యధిక రికార్డుగా దీనిని వాతావరణ శాఖ నమోదు చేసింది. ఈ స్థాయి వర్షాలకు పైర్లు నిలువునా రాలిపోతున్నాయి. పంటచేలలో నీరు నిలిచి మునిగిపోతే నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది తప్పితే ఇప్పడు కురుస్తున్న వర్షాలకు పంటలు రోజుల తరబడి నీటమునిగి ఉండటం లేదు. కానీ పూత, కాత రాలిపోవడం వల్ల కంటికి కనిపించని నష్టం అధికంగా ఉంటోంది. ఆదిలాబాద్‌ జిల్లాలో పత్తి, సోయా పంటలకు పూత, కాత రాలి రైతులు బాగా నష్టపోయారు. నష్టాలపై అంచనా ఏమీ వేయలేదని జిల్లా వ్యవసాయాధికారి తెలిపారు. పంట నష్టంపై వివరాలు సేకరిస్తామని, జిల్లావారీగా పంటలపై పరిశీలన చేయిస్తామని వ్యవసాయ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.