తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు పదవీకాలాన్ని పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 10తో మూడేళ్ల పదవీకాలం పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో బాలమల్లు పదవీ కాలాన్ని మరో మూడేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ సందర్భంగా బాలమల్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రెండోసారి తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, తెలంగాణలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి కృషిచేస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 2016 అక్టోబరు 10న ఆయన టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
ఇదీ చూడండి : నోటీసు లిస్తారా.. తొలగిస్తారా..? తేల్చుకోండి..!