డిగ్రీ, పీజీ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగించాలని కోరుతూ... రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాలయాలకు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మర్రి శశిధర్ రెడ్డి లేఖలు రాశారు. కరోనా మహమ్మారి ప్రభావంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని... వేలాది మంది విద్యార్థులు ఫీజులు చెల్లంచలేని పరిస్థితిలో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితిలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, వారందరికి ఫీజులు చెల్లించుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు.
చివరి సెమిస్టర్ విద్యార్థులకు జులై 15వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించినందున... ఈ నెల 20వ తేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లింపునకు ఆయా విశ్వవిద్యాలయాలు గడువు విధించాయి. ఇప్పటికే ఈ గడువు ముగిసినందున ఫీజు చెల్లించని విద్యార్థులకు అపరాధ రుసుం లేకుండా... పరీక్ష ఫీజు కట్టించుకునేలా చర్యలు తీసుకోవాలని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మ గాంధీ, పాలమూరు, తెలంగాణ విశ్వవిద్యాలయాల వీసీలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంపీ కోమటి రెడ్డి లేఖ