ETV Bharat / state

'రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాలపై నిపుణులు దృష్టి సారించాలి'

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ వర్క్‌షాప్‌ను మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి ప్రారంభించారు.

author img

By

Published : Jul 26, 2019, 8:49 PM IST

నిపుణులు దృష్టి సారించాలి

అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుంటూ... అతి తక్కువ ఖర్చుతో పాటు నాణ్యమైన రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణంపై నిపుణులు దృష్టి సారించాలని రవాణాశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ వర్క్‌షాప్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ వర్క్‌షాప్‌లో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాలకు సంబంధించిన 7 రాష్ట్రాలకు చెందిన ఇంజినీర్లు, నిపుణులు పాల్గొంటున్నారని... రోడ్ల నిర్మాణంలో వస్తున్న కొత్త సాంకేతికపై వారు చర్చించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.

నిపుణులు దృష్టి సారించాలి

ఇవీ చూడండి: ఊచలు లెక్కపెట్టాడు.. యువతిని అపహరించాడు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.