ETV Bharat / state

ఆఫీసు పని వేగంగా చేయాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి - latest news on employment

Expert tips to do office work faster: రోజు ఆఫీసులో పని భారం ఎక్కవ అవడం వలన ఇంటికి వెళ్లడం చాలా సమయం పడుతుంది. ఇలా కాకుండా పని వేగంగా చేసి సమయాన్ని ఆదా చేయాలను అనుకొంటున్నారా లేదా వేరే పని ఉండి ఉన్న వర్క్​ని వేగంగా చేయాలని అనిపిస్తుందా.. అలా అనుకొన్న ఏమి చేయాలో ఆలోచన రావడం లేదా? అయితే కొంత మంది నిపుణులు పని చేసే సమయాన్నితగ్గించేందుకు కొన్ని సూచనలు ఇచ్చారు. అవి ఏమిటంటే..

Instructions to employees
ఉద్యోగులకు సూచనలు
author img

By

Published : Jan 26, 2023, 1:40 PM IST

Expert tips to do office work faster: కొందరు ఆఫీసు పనిని ఎంతో తేలిగ్గా చేసేస్తారు. మరికొందరు దాన్నో బరువుగా భావిస్తూ ఒత్తిడిని పెంచుకుంటారు. మీరు కూడా ఆఫీసు పనిని చకచకా పూర్తిచేయాలనుకుంటున్నారా? అయితే ఈ మార్పులని ఆహ్వానించండి..

  • ఎక్కువ గంటలు పనిచేయాలనే లెక్కల కంటే... చేసే పనిని ఎంత స్మార్ట్‌గా, నాణ్యంగా పూర్తిచేస్తామన్నదే ముఖ్యం. ఏది ముఖ్యమో నిర్ధరించుకుని.. ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయండి. నిర్విరామంగా పనిచేసినా.. పనిలో నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. రెండు గంటలకోసారైనా చిన్నపాటి విరామాలు తీసుకోవడం వల్ల ఒత్తిడి దరి చేరదు.
  • తినీ తినక.. హడావుడిగా ఆఫీసుకెళ్లిన కొద్దిసేపటికే ఆకలి మొదలవుతుంది. ఇలాంటప్పుడు ఖాళీ కడుపుతో ఉండిపోయినా, జంక్‌ఫుడ్‌ తినడం మొదలుపెట్టినా జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. అందుకే కాసిని నట్స్‌, ఎండు ద్రాక్ష, ఖర్జూరం వంటివి దగ్గర ఉంచుకోండి. ఇవి మీకు తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటూ ఆకలినీ తగ్గిస్తాయి.
  • డెస్క్‌టాప్‌ మీద అయినా, డెస్క్‌ మీద అయినా.. అవసరం లేని ఫోల్డర్లూ, కాగితాలూ, ఫైల్స్‌ వంటివన్నీ ఎప్పటికప్పుడు తీసేయండి. ఇంటిని అందంగా చక్కదిద్దుకున్నట్లే డెస్క్‌నీ అందంగా సర్దేయండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఓ చిన్న మొక్కను మీ టేబుల్‌పై పెట్టండి. ఆహ్లాదంగా అనిపిస్తుంది.
  • ఆఫీసుకు వెళ్లింది మొదలు.. గంటల తరబడి కూర్చుని పనిచేస్తుంటాం. దానివల్ల బరువు పెరగడం ఒక్కటే కాదు, శక్తి కూడా తగ్గుతుంది. దాంతో కాసేపు కూర్చోగానే త్వరగా అలసిపోతుంటాం. ఏ కొద్ది సమయం చిక్కినా నాలుగు అడుగులు వేయడానికి ప్రయత్నించండి. వాడే కంప్యూటర్‌ ఎత్తు, మనం కూర్చునే విధానం అన్నీ సరి చూసుకోవాలి. లేదంటే దీర్ఘకాలంలో చూపు తగ్గడం, నడుం నొప్పి, కాళ్లవాపులు వంటివి ఎదురుకావొచ్చు.
  • పని చేసే విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా దానికి సరైన సమాధానం దొరకకపోతే కాసేపు విశ్రాంతి తీసుకొని ఆ సమస్య గురించి ఆలోచించడం మంచిది. అలా ఆలోచించడం వలన మెదడు చురుగ్గా ఆలోచించి తొందరగా పరిష్కార మార్గాలు దొరుకుతాయి.
  • పని ఎక్కువుగా ఉన్నప్పుడు ఆ వర్క్ చేయడంలో ఉండిపోరాదు. ఎందుకంటే ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. కావున పనితో పాటు సమాయానికి భోజనం చేయాలి. దీని వలని కాసేపు విశ్రాంతి దొరికి ఒత్తిడి తగ్గడం వలన మరింత వేగంగా పనిచేయగల్గుతారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.