ETV Bharat / state

రాజధానిలో నాలాల విస్తరణ.. సవాళ్లే అడుగడుగున!

భాగ్యనగరంతో పాటు శివారు నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల పరిధిలో నాలాలు, చెరువులు, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో చేపట్టిన నిర్మాణాలను తొలగించడానికి సర్కార్‌ సిద్ధమవుతోంది. క్షేత్రస్థాయిలో చూస్తే ఈ తొలగింపు కత్తి మీద సామేనని చెబుతున్నారు. శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ సంఘాలు సహకరిస్తేనే సాధ్యమన్నది అధికారుల మాట. నగరంలోని నాలాలపై ఉన్న దాదాపు 1200 అక్రమ నిర్మాణాలను తొలగించాలని గతంలో అధికారులు ప్రయత్నించినా స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో అడుగు ముందుకు కదలని పరిస్థితిని ఉదహరిస్తున్నారు.

Obstacles to the expansion of canals in Hyderabad
హైదరాబాద్​లో నాలాల విస్తరణకు అడ్డంకులు
author img

By

Published : Nov 10, 2020, 12:40 PM IST

ఇటీవల భారీ వర్షాలకు రాజధానిలో వేలాది కాలనీలు ముంపునకు గురయ్యాయి. పది లక్షలమంది ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ ఇబ్బందులుపడ్డారు. వరదలు వచ్చి సోమవారం నాటికి ఇరవై అయిదు రోజులైనా ఇప్పటికీ 50 కాలనీలు నీటిలోనే ఉన్నాయి. దీనంతటికీ కారణం నాలాలు, చెరువుల ద్వారా ప్రవాహం కిందకు వెళ్లే మార్గం లేకపోవడమే. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి నాలాలు, చెరువుల ఎఫ్‌టీఎల్‌లో చేపట్టిన నిర్మాణాలను తక్షణం కూల్చివేయమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొద్దిరోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దిగి బల్దియాతోపాటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని మున్సిపల్‌, కార్పొరేషన్ల పరిధిలో నాలాలు, చెరువులు, శిఖం భూములు, ఎఫ్‌టీఎల్‌లో నిర్మించినవాటిని తొలగించాలని స్పష్టంచేశారు. 6 నగరపాలక సంస్థలు, 10 పురపాలక సంఘాల పరిధిలో ఆక్రమణలను తొలగించాలని సీడీఎంఏ ఎన్‌.సత్యనారాయణ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వాటన్నింటినిలో దాదాపు 10వేల వరకు కూల్చివేయాల్సినవి ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

నాడు నల్లవాగు తరహాలో..

పల్లెచెరువు నుంచి మొదలై పాతబస్తీ మీదుగా ప్రవహించే నల్లవాగు విస్తరణ కార్యక్రమం 15 ఏళ్ల క్రితం సాఫీగా జరిగిపోయింది. చిన్నపాటి వర్షాలకు దీనివెంట ఉన్న వందల కాలనీలు అప్పట్లో మునిగిపోయేవి. నాడు బల్దియా కమిషనర్‌గా ఉన్న కృష్ణబాబు ఈ నాలా విస్తరణ బాధ్యతను తీసుకున్నారు. 12 కిలోమీటర్ల పొడవున నాలా ఉండగా అందులో 6 కి.మీ. పొడవున ఉన్న వందల నిర్మాణాలను కూల్చివేశారు. 50 అడుగుల మేర నాలాలను విస్తరించారు. ఎంఐఎం శాసనసభ్యులు, ఇతర నేతలు సహకరించారు. అక్రమణదారులతో చర్చలు జరిపి వారిని అక్కడి నుంచి తప్పుకునేలా ఏర్పాట్లుచేశారు. వారికి తగిన తోడ్పాటు అందించారు. చాలా కాలం ముంపు సమస్య తీరింది.

ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందిస్తేనే..

మంత్రి కేటీఆర్‌ ఆదేశం మేరకు వరంగల్‌లో నాలాలపై పెద్దఎత్తున ఆక్రమణలు తొలగించారు. ఓ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసును సైతం అధికారులు తీసివేయడంతో అనేకమంది ఆక్రమణదారులు దారికి వచ్చారు. ఇదే తరహాలో జీహెచ్‌ఎంసీతో పాటు నగర శివార్లలోనూ పూర్తి స్థాయిలో దృష్టిసారించి ఆక్రమణలను తొలగించాలని బాధితులు కోరుతున్నారు. తమ నియోజవకర్గాల పరిధిలో ఈ ప్రక్షాళన కార్యక్రమంపై అధికారులకు శాసనసభ్యులు తోడ్పాటు అందిస్తే ఫలితం ఉంటుందని అనేకమంది సూచిస్తున్నారు.

నాలాల ప్రక్షాళనకు సంబంధించి ప్రభుత్వం నియమించిన కిర్లోస్కర్‌ కమిటీ ఈ అక్రమ నిర్మాణాలపై నివేదిక ఇచ్చింది. ప్రధానంగా నీటి ప్రవాహానికి అడ్డుపడుతున్న పలు నిర్మాణాలను తొలగించేందుకు సర్కారు ఆదేశించినా స్థానికుల నిరసనతో అధికారులు ముందుకు వెళ్లలేకపోయారు. దీంతో నగరంలో నాలాల విస్తరణ ఎక్కడికక్కడే ఆగిపోయింది. ఏడాది క్రితం 1200 అక్రమ నిర్మాణాలను తొలగించి నాలాలను విస్తరించి ఉంటే ఇటీవల భారీ వర్షాలకు వందల కాలనీల్లో ముంపు తలెత్తి ఉండేది కాదని బల్దియా ఇంజినీర్లే చెబుతున్నారు.

1295 కి.మీ. రాజధాని పరిధిలో చిన్న, పెద్ద నాలాల విస్తీర్ణం

28వేలు.. వీటిపై ఉన్న అక్రమ నిర్మాణాలు

1200 ఏడాది క్రితం తొలగించాలని ప్రభుత్వం ఆదేశించిన నిర్మాణాలు

20శాతం విస్తరణ పనులు జరిగింది ఇంతే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.