హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూజియంలో అంతర్జాతీయ ఖురాన్ గ్రంథాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వివిధ సాహిత్య, సాంస్కృతిక సంస్థల సహకారంతో నగరంలోని కాన్పులేట్ ఆఫ్ ఇరాన్ మొదటిసారిగా ప్రదర్శనను నిర్వహిస్తోంది. ఇందులో ఖురాన్ పద్యాల ఇరానీ కాలీగ్రాఫీకి సంబంధించిన 100కు పైగా కళాఖండాలున్నాయి. మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో కాలీగ్రాఫీ, ఖురాన్ ఆర్ట్‌పై కార్యశాల నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇరాన్‌కు చెందిన ఖురాన్‌కు సంబంధించిన ముగ్గురు కళాకారులు, కాలీగ్రాఫర్లు కూడా హాజరయ్యారు.
ఇదీ చూడండి: చర్చలు సఫలం... సమ్మె విరమించిన జూడాలు