దసరా పండగ నేపథ్యంలో రాష్ట్ర చేనేత సహకార సంస్థ బంజారాహిల్స్లో చేనేత వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు ఏర్పాటు చేసింది. కళింగ భవన్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రారంభించారు. చేనేత ఉత్పత్తులను ఆమె పరిశీలించారు.
పోచంపల్లి, నారాయణపేట, సిద్దిపేట గొల్లబామ, కాటన్ చీరలు, పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్స్, రాష్ట్రంలోని అన్ని రకాల చేనేత ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచినట్లు టెస్కో ప్రతినిధులు తెలిపారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రదర్శన ఏర్పాటు చేశామని... ఈనెల 23 వరకు ఈ ప్రదర్శన ఉంటుందని చెప్పారు. చేనేత వస్త్రాల మీద 30 శాతం రాయతీ ఇస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: అధైర్య పడొద్దు.. ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి కేటీఆర్