ETV Bharat / state

కాసుల వర్షం కురిపిస్తున్న అబ్కారీ శాఖ.. ఈ ఆర్థిక ఏడాదిలో ఆదాయం ఎంతో తెలుసా?

Excise Revenue: రాష్ట్రంలో గడిచిన ఆర్థిక సంవత్సరం అబ్కారీశాఖ ఆదాయం 30వేల కోట్లు దాటింది. అంతకుముందు ఏడాదిలో 26వేలకోట్లు వస్తే... 2021-22లో మరో 4వేల కోట్లు పెరిగాయి. గత డిసెంబర్‌లో మద్యం విక్రయాలపై వ్యాట్‌ ఆదాయం 1,536 కోట్లు రాగా... ఎక్సైజ్‌ సుంకంతో కలిపి నెలకు సగటున రెండున్నర వేల కోట్ల రాబడి వస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కాసుల వర్షం కురిపిస్తున్న అబ్కారీ శాఖ.. ఈ ఆర్థిక ఏడాదిలో ఆదాయం ఎంతో తెలుసా?
కాసుల వర్షం కురిపిస్తున్న అబ్కారీ శాఖ.. ఈ ఆర్థిక ఏడాదిలో ఆదాయం ఎంతో తెలుసా?
author img

By

Published : Apr 11, 2022, 2:39 AM IST

Excise Revenue: రాష్ట్రంలో ఎక్సైజ్‌ శాఖ ఆదాయం ఏటికేడూ పెరుగుతూనే ఉంది. వాణిజ్య పన్నుల శాఖ తర్వాత ప్రభుత్వానికి అత్యధికంగా రాబడిని తెచ్చిపెడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ద్వారా ఆదాయం 10 నుంచి 12వేల కోట్లకు మించలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత.. ప్రభుత్వం గుడుంబాను వందశాతం కట్టడి చేయడం, అక్రమ మద్యానికి చెక్‌ పెట్టడంతో విక్రయాలు భారీగా పెరిగాయి. దీంతో పాటు ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌ రాబడి, మద్యం దుకాణాలు, పబ్‌లు, బార్లు, క్లబ్‌ల లైసెన్స్‌ ఫీజులు ద్వారా వచ్చే ఆదాయం అనూహ్యంగా పెరిగింది. వీటికి తోడు మద్యం ధరలు పెంచడం, తాగేవారి సంఖ్య అధికం కావడం కూడా రాబడికి కలిసొచ్చింది.

రాష్ట్రంలో విధిస్తున్న ఎక్సైజ్‌ డ్యూటీ, వ్యాట్‌లను పరిగణనలోకి తీసుకుంటే... వంద రూపాయల్లో మద్యం తయారీ, విక్రయదారులకు 36 నుంచి 38శాతం పోతోంది. మిగిలిన 62 నుంచి 64శాతం ఎక్సైజ్‌ డ్యూటీ, వ్యాట్‌ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ఇది కాకుండా బార్లు, మద్యం దుకాణాలు, క్లబ్‌లు, పబ్‌లకు లైసెన్స్‌లు ఇవ్వడం ద్వారా కూడా భారీగా రాబడి సమకూరుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని వ్యవస్థలపై కరోనా ప్రభావం కనిపించినా.. మద్యం అమ్మకాలపై మాత్రం పడలేదు. 2020-21 ఆర్థిక ఏడాదిలో మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.26,400 కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. అంటే నెలకు సగటున రూ.2,200 కోట్లు రాబడి వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదే 2021-22 ఏడాదిలో ఎక్సైజ్‌ డ్యూటీ, లైసెన్స్‌ ఫీజు, ఇతరత్ర ద్వారా 17వేల కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. వీటితో పాటు మరో 13,577 కోట్లు మద్యం విక్రయాలపై విధించే వ్యాట్‌ ద్వారా సమాకూరింది. అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో 30,646 కోట్ల మేర రాబడి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అంటే సగటున నెలకు రూ. 2,554 కోట్లు రాబడి వచ్చింది. అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోలిస్తే నెలకు సగటున మూడున్నర వందల కోట్లు అధికంగా వచ్చాయి.

ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో 33వేల కోట్లు అంతకు మించి ఆదాయం వస్తుందని అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. ఎక్సైజ్‌ డ్యూటీ కింద 17వేల 500 కోట్లు, వ్యాట్‌ ద్వారా మరో 15వేల 500 కోట్లు వస్తాయని లెక్కలు కట్టింది.

ఇదీ చదవండి: madhapur water: వడ్డెరబస్తీలో పెరుగుతున్న బాధితులు.. న‌ల్లాలకు ట్యాప్‌లు బిగించిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.