ETV Bharat / state

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులపైనే చర్యలు: శ్రీనివాస్​గౌడ్​

రాష్ట్రంలో గుడుంబా తయారీ, సరఫరాపై ఉక్కుపాదం మోపే దిశగా అబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. అవసరమైతే పీడీ చట్టాన్ని ప్రయోగించి.. కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. నెల రోజుల్లో రెండు వేలకుపైగా కేసులు పెట్టారు. సుమారు రెండువేల మందిని అబ్కారీ అధికారులు అరెస్టు చేశారు. పెద్ద ఎత్తున లిక్కర్‌, బీరు, గుడుంబా, బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నారు.

minister srinivas goud
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులపైనే చర్యలు: శ్రీనివాస్​గౌడ్​
author img

By

Published : Apr 23, 2020, 6:49 AM IST

లాక్​డౌన్​ కారణంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఇదే అదనుగా తమ వద్ద ఉన్న నిల్వలను గుట్టుచప్పడు కాకుండా అధిక ధరలకు అమ్మి కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గుడుంబా నుంచి బయటపడిన వారిలో ఎక్కువ మంది తిరిగి తయారీ మొదలు పెట్టినట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది.

మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 21వ వరకు సుమారు 2,093 కేసులు నమోదు చేసిన అధికారులు.. 1978 మందిని అరెస్టు చేశారు. ఆరు వేల లీటర్లకుపైగా లిక్కర్‌, నాలుగున్నర వేల లీటర్లు బీరు, 5,300 లీటర్లు గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. 82 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. విక్రయాలకు పాల్పడిన వారిపై 656 కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అందులో ఎక్కువ కేసులు వరంగల్‌, నల్గొండ ఎక్సైజ్‌ డివిజన్లలో ఉన్నాయి. గుడుంబా తయారీపై 1,182 కేసులు నమోదవ్వగా.. 1,071 మందిని అరెస్టు చేశారు. అందులో ఎక్కువ వరంగల్‌లో 328, మహబూబ్‌నగర్‌లో 221, కరీంనగర్‌ ఎక్సైజ్‌ డివిజన్ల పరిధిలో 172 చొప్పున కేసులు నమోదయ్యాయి. వరుసగా 269, 240, 104 మందిని అరెస్ట్​ చేశారు.

గుడుంబా తయారీ పెరిగిందన్న వార్తలతో బుధవారం.. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గుడుంబా నియంత్రణలో నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని అధికారులను మంత్రి హెచ్చరించారు. గుడుంబా నిర్మూలనకు పక్కా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే పీడీ చట్టాన్ని ప్రయోగించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

ప్రధానంగా ఆదిలాబాద్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో గుడుంబా నిరోధానికి చర్యలు ముమ్మరం చేసినట్లు మంత్రికి అధికారులు వివరించారు.

ఇవీచూడండి: నెల వ్యవధిలోనే 20 వేలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.