ETV Bharat / state

మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు

author img

By

Published : Jul 3, 2021, 3:32 PM IST

Updated : Jul 3, 2021, 4:34 PM IST

మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు
మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు

15:31 July 03

ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అంధారి ఐరన్‌ఓర్ ప్లాంట్‌పై మావోలు దాడి చేశారు. పరిశ్రమకు చెందిన 6 వాహనాలను తగులబెట్టారు.   

కార్మికులను కూడా కిడ్నాప్‌ చేస్తుండగా సమాచారం అందుకొని అక్కడకు చేరుకున్న భద్రతా బలగాలు వారిని అడ్డుకున్నాయి. ఈ క్రమంలో చోటేడోంగ్రి వద్ద ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. పోలీసుల నుంచి తప్పించుకున్న మావోయిస్టులు పలువురు కార్మికులను అపహరించి అడవుల్లోకి వెళ్లారు. కార్మికులను రక్షించేందుకు భద్రతా బలగాలు అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. ఉన్నతాధికారులు ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించారు. 

మరోవైపు కిడ్నాప్​కు గురైన కార్మికుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమవారిని క్షేమంగా తీసుకురావాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. వారికేమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. 

ఇదీ చూడండి: Live video: వేగంగా దూసుకొచ్చి కారును ఢీకొట్టిన లారీ

Last Updated : Jul 3, 2021, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.