ETV Bharat / state

ఎనీ వేర్​-ఎనీ టైం సేవలకు గుర్తింపు.. అవార్డు ప్రదానం - Transport Department commissioner rao latest news

వినియోగదారుల సౌలభ్యం కోసం రవాణా శాఖ తీసుకొచ్చిన ఎనీ వేర్​-ఎనీ టైం సేవలకు గుర్తింపు లభించింది. ఇండియన్​ ఎక్స్​ప్రెస్​ సంస్థ ఎక్సలెన్సీ పురస్కారాన్ని ప్రకటించింది. కమిషనర్​ ఎం.ఆర్​.ఎం.రావు ఆన్​లైన్​ ద్వారా ఈ అవార్డును అందుకున్నారు.

Excellence Award for Any Wear - Any Time Services
ఎనీ వేర్​-ఎనీ టైం సేవలకు గుర్తింపు.. అవార్డు ప్రదానం
author img

By

Published : Feb 24, 2021, 5:42 PM IST

రవాణా శాఖలో ఎనీ వేర్-ఎనీ టైం సేవలకు గానూ ఇండియన్ ఎక్స్​ప్రెస్ సంస్థ ఎక్సలెన్సీ పురస్కారాన్ని అందజేసింది. డిజిటల్ టెక్నాలజీ సభలో కమిషనర్​ ఎం.ఆర్.ఎం.రావు ఈ అవార్డును ఆన్​లైన్ ద్వారా స్వీకరించారు.

వినియోగదారులు, దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం సాంకేతిక మేథాతో లైసెన్స్ రెన్యువల్, డూప్లికేట్ లైసెన్స్​లు, చిరునామా మార్పిడి, బ్యాడ్జ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్, తదితర వాటిని ఆన్​లైన్ ద్వారా రవాణా శాఖ అందుబాటులోకి తీసుకొచ్చి ఈ సేవలను అందిస్తోందని కమిషనర్​ పేర్కొన్నారు. రవాణా కార్యాలయాలకు రాకుండానే దరఖాస్తుదారులకు 17 పౌర సేవలను ఆన్​లైన్​లో అందిస్తున్నామన్నారు. మిగతా సేవలనూ త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు.

నియమ, నిబంధనలను అనుసరిస్తూ వాహనదారులు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఈ సేవలను పొందవచ్చని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ఆన్​లైన్ ద్వారా ఆయా సేవలకు సంబంధించిన ఫీజులు చెల్లించి, సరిపడా పత్రాలు సమర్పిస్తే చాలని.. ఇతరులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు.

ఇదీ చూడండి: కత్తితో గొంతు కోసుకుని యువతి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.