లాక్డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లల్లోనూ ఉండాలంటూ ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ శంకరరావు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు... బయటకు రావద్దని హితవు పలికారు. తన సతీమణి స్వర్ణలత హెయిర్ కట్ చేసిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ పలు సూచనలు చేశారు. అందరూ లాక్డౌన్ పాటించాలని సూచించారు. కొందరు దూరాన్ని విస్మరిస్తున్నారని.. అలా చేయటం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని శంకరరావు హెచ్చరించారు.
ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్: రెక్క విప్పుతున్న నిరుద్యోగం