తెలంగాణలో బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకునే పనిలో భాజపా సఫలికృతమవుతోంది. తాజాగా పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వివేక్ ఈ రోజు భాజపా అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ కానున్నట్లు సమాచారం. ఇప్పటికే భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాంధవ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తెరాస నుంచి పెద్దపల్లి ఎంపీ టికెట్ దక్కకపోవడం వల్ల వివేక్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అప్పుడు కమలనాథులు టికెట్ ఇచ్చి పోటీ చేయించాలని భావించినా అందుకు ఆయన నిరాకరించారు. వివేక్‌తోపాటు సోదరుడు, మాజీ మంత్రి వినోద్ కూడా కమలం గూటికి చేరే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: చింతమడక అభివృద్ధికి రూ 200 కోట్లు: కేసీఆర్