హుజూర్‌నగర్ ఎన్నిక అంటే ప్రభుత్వం భయపడుతుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఉపఎన్నికలో కాంగ్రెస్ను గెలిపించాలన్నారు. సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు భూమయ్యను అరెస్టు చేస్తే హోంమంత్రికి తెలియదని అనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మిడ్ మానేరు కట్టకు ప్రమాదం ఉందో.. లేదో.. ప్రభుత్వం చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. లోయర్ మానేరు 24టీఎంసీల సామర్థ్యం కాగా 16టీఎంసీలు మాత్రమే ఉంచుతున్నారని...ఈ అంశంపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మిడ్ మానేరు లీకేజీతో చొప్పదండి, కరీంనగర్ ప్రజలకు ముంపు పొంచి ఉందని.. దీనిపై ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని చొప్పదండి కాంగ్రెస్ నేత మేడిపల్లి సత్యం అన్నారు. మిడ్ మానేరులో జరిగిన అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించాలని సత్యం డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'కేటీఆర్ షాడో సీఎంలా వ్యవహరిస్తున్నారు'