పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటను గౌరవించి తాను పార్టీ వీడుతున్నట్లు ఎవరికీ చెప్పలేదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ఇదివరకే తెలియజేశానని వెల్లడించారు. పార్టీకి నష్టం జరుగుతుందని ఎవరికీ చెప్పలేదని.. కానీ మీడియా ద్వారా తెలిసిందన్నారు.
వచ్చే మూడు నెలల్లో అందరితో చర్చించి ప్రజల కోసం నిర్ణయం తీసుకుంటానని ఆయన వివరించారు. కొత్త పార్టీ పెట్టాలా? స్వతంత్రంగా ఉండాలా? మరో పార్టీలో చేరాలా? అన్న అంశంపై అందరితో కలిసి చర్చిస్తానని తెలిపారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాకే ప్రకటన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములు నాయక్‌లకు నష్టం జరుగుతుందనే బహిరంగ ప్రకటన చేయలేదని వివరించారు. పార్టీలో నాకు పూర్తి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.