ETV Bharat / state

'డిసెంబర్​ 8న​ లంబాడీల సత్తా చూపిస్తాం'

తెలంగాణ రాష్ట్రం వస్తే తమ బతుకులు బంగారం అవుతాయనుకుంటే... రోడ్డుపాలు అయ్యాయని మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

Ex MLC Ramulu Naik fires on TRS government

author img

By

Published : Nov 27, 2019, 10:38 PM IST

'సీఎం కేసీఆర్​కు డిసెంబర్​ 8న​ లంబాడీల సత్తా ఏమిటో చూపిస్తాం'

విభజించు... పాలించు అనే సిద్ధాంతంతో రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లంబాడీల సత్తా ఏమిటో రుచి చూపిస్తామని మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌ హెచ్చరించారు. 10 శాతం రిజర్వేషన్లను పక్కదోవ పట్టించేందుకే గిరిజనుల మధ్య విభేదాలు సృష్టించి గోడవల పెడుతున్నారని ఆరోపించారు.

డిసెంబర్‌ 8వ తేదీన సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో లంబాడోళ్ల తడాఖా మహా సంగ్రామ సభను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు రాములు నాయక్​ తెలిపారు. హైదరాబాద్‌ సోమాజిగూడలో ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో లంబాడోళ్ల తడాఖా బస్సు యాత్రను మాజీ ఎంపీ రవీంద్రనాయక్​తో కలిసి ప్రారంభించారు. గిరిజనులు ఐక్యంగా ఉంటే ముఖ్యమంత్రి ఆటలు సాగవు అనే ఉద్దేశంతోనే గిరిజనుల మధ్య గోడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. లంబాడీలను ఎస్టీ నుంచి తొలగించాలనే ఆలోచన చేస్తే యుద్ధం జరుగుతుందని హెచ్చరించారు.

ఇవీ చూడండి:'ప్రభుత్వ తీరు మారకుంటే.. కార్యాచరణ ప్రకటిస్తాం'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.