ETV Bharat / state

'ఆ విశ్వవిద్యాలయాలు రద్దుచేయాలి' - కొత్త విశ్వవిద్యాలయాల తాజా సమాచారం

రాష్ట్రంలో అడ్డదారిన ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. ఆ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. పేదలు ఆ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే అవకాశాన్ని కోల్పోతారని వంశీచంద్ ఆవేదన చెందారు.

ex mla vamshi reddy comments functioning of universities should be abolished in telangana
'అడ్డదారిన అనుమతి ఇచ్చిన విశ్వవిద్యాలయాలు రద్దుచేయాలి'
author img

By

Published : May 21, 2020, 3:51 PM IST

తెలంగాణలో కొత్తగా అనుమతి ఇచ్చిన ప్రైవేటు విశ్వవిద్యాలయాల అనుమతిని రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు. దొడ్డిదారిన ఇచ్చిన ఆ ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. ఆర్డినెన్స్‌లో పేదలు విశ్వవిద్యాలయాల్లో చదువుకునే అవకాశాన్ని కోల్పోతారని వంశీచంద్ తెలిపారు. ఆ విషయంలో ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినట్లు ఆయన చెప్పారు.

ప్రభుత్వ యూనివర్సిటీలకు వీసీల నియామకం చేయలేదని.. కొత్తగా ప్రైవేటు యూనివర్సిటీలకు మాత్రం అనుమతులిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో బోధించే ఫ్యాకల్టీలకు వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ఈ తరుణంలో వారంతా కూలీ పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : కరోనా విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా లేదు: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.