రైతు సమస్యలపైనే కాదు.. ప్రతి అంశంలోనూ కేంద్రంపై పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. చేతులకు బేడీలు వేస్తారనే భయంతోనే సీఎం కేసీఆర్.. అసెంబ్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయట్లేదని ఆరోపించారు. అప్పుల బాధతో చనిపోతున్న కౌలు రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వరని నిలదీశారు.
భాజపా మినహా
తెలంగాణ రైతులను మోసం చేస్తున్న కేసీఆర్.. దేశ రైతులకు మద్దతు తెలపడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందని పొన్నాల ఎద్దేవా చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధరను ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రతి అంశంలోనూ కేంద్రానికి అనుకూలంగా వ్యవహరించిన తెరాస.. ఇప్పుడు రైతులను మోసం చేసేందుకు కొంగ జపం చేస్తోందని విమర్శించారు. రేపటి భారత్ బంద్‌కు భాజపా మినహా అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు.
ఇదీ చదవండి: కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే పీవీకి భారతరత్న ప్రకటించాలి: కేటీఆర్