హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు శానిటేషన్పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈస్ట్ జోన్ పరిధిలోని గడ్డి అన్నారంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. దోమల నియంత్రణకు నూతన ఫాగింగ్ యంత్రాలు ప్రారంభించి సిబ్బందికి అందజేశారు.
ఇతర నగరాలతో పోల్చితే శానిటేషన్లో మనం చాలా ముందంజలో ఉన్నామని.. నగరంలో ఉన్న సుమారు కోటి మంది జనాభా కోసం దాదాపు 20 వేల మంది కార్మికులు పని చేస్తున్నారని రామ్మోహన్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శానిటేషన్లో భాగస్వాములు అయినప్పుడే స్వచ్ఛ హైదరాబాద్ సాధ్యపడుతుందని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు పూర్తిగా నిషేధించాలని కోరారు.
నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రత్యేక డ్రైవ్లో స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, కార్పొరేటర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఇవాళ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ పరిశీలన