ETV Bharat / state

corona vaccine: వేళకు రెండో డోసు తీసుకుంటేనే యాంటీబాడీలు: డీహెచ్‌ - కొవిడ్​ వ్యాక్సిన్​పై డీహెచ్​ వ్యాఖ్యలు

తొలి డోసు తర్వాత గడువులోగా రెండో డోసు తీసుకోవాలని (should be take in two doses covid vaccine) ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. సరైన వేళకు రెండో డోసు తీసుకుంటేనే యాంటీబాడీలు వస్తాయని స్పష్టం చేశారు.

dh srinivas rao
dh srinivas rao
author img

By

Published : Oct 20, 2021, 6:43 PM IST

Updated : Oct 20, 2021, 7:11 PM IST

కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రతి ఒక్కరు తప్పకుండా రెండు డోసుల వ్యాక్సిన్ (covid vaccine) తీసుకోవాలని డీహెచ్ శ్రీనివాస రావు (dh srinivas rao) పేర్కొన్నారు. కోఠీలోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన.... రాష్ట్రంలో ప్రస్తుతం తొలిడోస్ తీసుకుని గడువు ముగిసినా రెండో డోస్ తీసుకోని వారి సంఖ్య 36 లక్షలకు చేరిందని... పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. (should be take in two doses covid vaccine).

ప్రస్తుతం వెలుగు చూస్తున్న కొవిడ్ కేసుల్లో అసలు టీకా తీసుకోని వారు 60 శాతం వరకు ఉండగా, మరో 30 శాతం మందికి ఒకడోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారే అని స్పష్టం చేశారు. రెండు డోసులు పూర్తైన వారిలో కేవలం ఐదు నుంచి పది శాతం మందికి మాత్రమే కొవిడ్ సోకుతోందని పేర్కొన్నారు. అలాంటి వారిలో సైతం తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవడం లేదని వివరించారు. ఇక చిన్నారులకు సైతం త్వరలో వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉందన్న డీహెచ్.... జైడస్ క్యాడిలా టీకాకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో ట్రైనింగ్ కార్యక్రమం చేపట్టినట్టు పేర్కొన్నారు.

వేళకు రెండో డోసు తీసుకుంటేనే యాంటీబాడీలు : డీహెచ్‌

రాష్ట్రంలో 50లక్షల వరకు వ్యాక్సిన్​ డోసులు నిల్వ ఉన్నప్పటికీ... 75 శాతం జనాభా మొదటి డోసు తీసుకున్నప్పటికీ... రెండో డోసు తీసుకోని వారు చాలా మంది ఉన్నారు. ఫస్ట్​ డోసు తీసుకుని రెండో డోసు తీసుకోని వారు రాష్ట్రంలో 36 లక్షల మందికి పైగా ఉన్నారు. రాష్ట్రంలో కొవిడ్​ పూర్తిగా తగ్గిపోయిందని అశ్రద్ధ చేయడం వల్ల చాలా మంది రెండో డోసు వేయించుకోవడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్​ తీసుకోని 20 శాతం మందిలో సుమారు 60 శాతం మంది వైరస్​ బారిన పడుతున్నారు. వారిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. - శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు

ఆ రెండు జిల్లాల్లోనే...

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతున్నా... కొన్ని జిల్లాల్లో ఇంకా 60శాతం మందికి టీకాలు అందలేదు. వ్యాక్సిన్‌ పంపిణీలో 98శాతంతో హైదరాబాద్‌ తొలిస్థానంలో (hyderabad first place) ఉండగా... 95 శాతంతో రంగారెడ్డి జిల్లా (vaccination in rangareddy district) రెండోస్థానంలో ఉంది. ఆ రెండు జిల్లాల్లో మాత్రమే 90శాతానికి పైగా మందికి తొలి డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తైంది. రాజన్న సిరిసిల్ల, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో 80 శాతానికిపైగా తొలిడోస్‌ ఇచ్చారు. ఇక 12 జిల్లాల్లో 70 శాతానికిపైగా.... మరో 12 జిల్లాల్లో 60 శాతానికి పైగా పూర్తైందని అధికారులు తెలిపారు. అయితే వరంగల్, నల్గొండ, జోగులాంబ గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో మాత్రం నేటికీ..... 60 శాతం మందికి టీకా అందలేదని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 75శాతం మందికి ఒక డోస్‌ అందించగా మరో 25శాతం మందికి ఒకటి రెండు నెలల్లో ఇవ్వాల్సి ఉంది.

ఇదీ చూడండి: DH on 3rd Wave: కరోనా కొత్త వేరియంట్ వస్తేనే మూడో వేవ్​: డీహెచ్​

Last Updated : Oct 20, 2021, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.