చేనేతలకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బాసటగా నిలిచింది. ఇకపై చేనేత కార్మికులకు మద్దతు పలికేందుకు ప్రతి శనివారం కమిషన్‌లోని ప్రతి ఉద్యోగి చేనేత వస్త్రాలను ధరించాలని ఏక గ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు కమిషన్ ప్రాంగణంలో ఈనెల 5న నిర్వహించిన ఉద్యోగుల అభినందన సభలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సభలోనే ఉద్యోగులు చేనేతలకు అండగా నిలవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ విషయమై కమిషన్ దృష్టి సారించి నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో చేనేత స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు కొనుగోలు చేసేందుకు రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఈ స్టాల్‌ను జస్టిస్ చంద్రయ్య ప్రారంభించారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉపాధి కల్పిస్తుందని ఆయన తెలిపారు. చేనేత కార్మికుల ఉపాధికి ఊతం ఇచ్చేందుకు తమ వంతు సాయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి : ఈ సమయంలో రాజకీయాలు వెతక్కండి: సబితా ఇంద్రారెడ్డి