ఎన్‌పీఆర్ సమస్య పరిష్కారం కోసం అందరం ఏకం కావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశంలో వివిధ కులమతాల ప్రజలు జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఇది ఒక మతానికి సంబంధించిన సమస్య కాదని తెలిపారు. ఎంతో మంది ప్రజాప్రతినిధులకు జనన ధ్రువీకరణ పత్రాలు లేవన్నారు. అసలు సమస్య పుట్టిన తేదీ సర్టిఫికెట్స్ అని ఆరోపించారు. ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇలా ఉంటే ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో కూడా చాలామందికి జనన ధ్రువీకరణ పత్రాలు లేవన్నారు. కేంద్రం ప్రమాదకరమైన ఎన్‌పీఆర్ చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. దేశంలోకి చొరబాటుదారులను అనుమతించాలని ఎవరూ చెప్పరని, అయితే సీఏఏ, ఎన్‌పీఆర్‌ను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తీర్మానంతో సరిపెట్టకుండా రాష్ట్రంలో అమలు చేయబోమని చట్టం తీసుకురావాలని కోరారు.
ఇదీ చూడండి : కరోనా కట్టడికి ప్రత్యేక చెక్‌పోస్టులు: మంత్రి ఈటల