Redco Company Set Up 150 Charging Centers In Telangana: కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రెడ్కో ఆధ్వర్యంలో గ్రేటర్ వ్యాప్తంగా 150ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో ఎక్కువ శాతం నెలాఖరు వరకు అందుబాటులోకి వస్తాయని రెడ్కో అభిప్రాయపడింది. ఇప్పటికే టెస్ట్ రన్‌లో భాగంగా ఛార్జింగ్ కేంద్రాల పనితీరును పరిశీలించింది. ఈ స్టేషన్లలో ప్రస్తుతం కార్లను ఛార్జింగ్ చేసుకోవచ్చని తెలిపింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టీఎస్ఐసీ, ఫుడ్ కార్పొరేషన్‌ల నుంచి సేకరించిన స్థలాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ స్టేషన్లలో.. వాహనదారుల సౌకర్యార్థం ఫుడ్ కోర్ట్‌లు, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు రెడ్కో సంస్థ ఛైర్మన్ సతీష్‌రెడ్డి తెలిపారు.
ఈవీ ఛార్జింగ్ కేంద్రాల సమాచారం అంతా ఒక్క క్లిక్‌లో అందుబాటులోకి వచ్చేలా రెడ్కో చర్యలు చేపట్టింది. టీఎస్ఈవీ యాప్‌లో వీటికి సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచారు. ఏయే ప్రాంతాల్లో ఛార్జింగ్ కేంద్రాలు ఉన్నాయి.. దగ్గర ప్రాంతంలో ఛార్జింగ్ కేంద్రం ఎక్కడ ఉంది..? ఒక్కో యూనిట్‌కు ఏ కంపెనీ ఎంత డబ్బులు వసూలు చేస్తుంది..? తదితర వివరాలన్నీ ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ఒక్కో కంపెనీకి చెందిన వాహనం ఫుల్ ఛార్జింగ్ కావడానికి యూనిట్లలో తేడాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
EV Charging Stations In Telangana: వరంగల్, నిజామాబాద్, కరీంనగర్‌లలో.. రానున్న కాలంలో 40కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రెడ్కో ఛైర్మన్ సతీష్ రెడ్డి వెల్లడించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ కేంద్రాల పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఉన్న ప్రైవేట్ ఛార్జింగ్ కేంద్రాల ధరల కంటే రెడ్కో ఏర్పాటు చేసిన ఈవీ స్టేషన్లలో ధరలు తక్కువగా ఉంటాయన్న సంస్థ.. ఛార్జింగ్ యూనిట్ల ధరను త్వరలోనే నిర్థారించనున్నట్లు తెలిపింది.
"తెలంగాణ ప్రభుత్వం ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచే క్రమంలో మేము ఇప్పటికే 30 ఫాస్టు ఛార్జింగ్‌స్టేషన్లను పెట్టాము. రాబోయే 1లేదా 2నెలల్లో దాదాపు 150 ఫాస్టు ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనున్నాము. దీనికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టీఎస్ఐసీ, పుడ్ కార్పొరేషన్‌ల నుంచి సేకరించిన స్థలాల్లో ఈ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాము. ఇప్పటికే ఒక 50 ఛార్జింగ్ స్టేషన్లు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవి మంత్రి కేటీఆర్ చేతులు మీదగా ప్రారంభించాలనుకుంటున్నాము. 2019లో 900 వాహనాలు ఉంటే.. 2020లో రాష్ట్ర ప్రభుత్వం ఈవీ పాలసీ తీసుకువచ్చిన తర్వాత క్రమంగా దాదాపు 48000కు పెరిగాయి. భవిష్యత్తులో మరింతగా పెరిగే అవకాశం ఉంది." - వై. సతీశ్‌రెడ్డి, రెడ్కో ఛైర్మన్
ఇవీ చదవండి: