ETV Bharat / state

"యూరప్ దేశాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి" - ఇండో-జర్మన్

యూరప్ విత్తన​ కంపెనీలు తెలంగాణ విత్తనరంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి కోరారు.

'తెలంగాణలో యూరప్ దేశాలు పెట్టుబడులు పెట్టాలి'
author img

By

Published : Nov 1, 2019, 10:29 PM IST

'తెలంగాణలో యూరప్ దేశాలు పెట్టుబడులు పెట్టాలి'

విత్తనోత్పత్తికి అత్యంత అనుకూల ప్రదేశమైన తెలంగాణలో యూరప్ విత్తన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. ఇండో-జర్మన్ విత్తన రంగ సహకార ప్రాజెక్టులో భాగంగా జర్మనీ పర్యటనలో భాగంగా మూడోరోజు బోన్ పట్టణంలో పర్యటించారు. జర్మన్ ప్లాంట్ బ్రీడర్స్ అసోసియేషన్, యూరప్ విత్తన కంపెనీల ప్రతినిధులతో మంత్రి నేతృత్వంలోని బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి, ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు పాల్గొన్నారు.

అభివృద్ది చెందుతున్న దేశాల విత్తన పరిశ్రమలతో పోటీపడుతూ భారత్ 15 వేల కోట్ల విలువ కలిగి ఉండి ఆసియా ఖండంలో అత్యున్నత స్థానంలో ఉందని జర్మన్ ప్లాంట్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కొనియాడారు. భారత్‌లో కూరగాయ పంటల విత్తనోత్పత్తిలో మంచి అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో విత్తనరంగ అభివృద్దికి ఎన్నో సంస్కరణలు చేపట్టామని మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు.

ఓఈసీడీ అంతర్జాతీయ విత్తన ధ్రువీకరణ ద్వారా విత్తన ఎగుమతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదారాబాద్‌లో ఇస్టా విత్తన పరీక్ష ల్యాబ్ ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి: దిల్లీ విమానాశ్రయంలో 'ఆర్​డీఎక్స్' కలకలం

01-11-2019 TG_HYD_63_01_MINISTER_ON_INVESTMENTS_APPEAL_AV_3038200 REPORTER : MALLIK.B Note : pics from desk whatsApp ( ) విత్తనోత్పత్తికి అత్యంత అనుకూల ప్రదేశమైన తెలంగాణ విత్తన రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. యూరప్ కంపెనీలు చైనా విత్తన రంగంలో పెట్టుబడులు పెడుతున్న దృష్ట్యా... అనుకూల పరిస్థితులు గల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ యూరప్ విత్తన కంపెనీలను ఆహ్వానించారు. ఇండో - జర్మన్ విత్తన రంగ సహకార ప్రాజెక్టులో భాగంగా జర్మనీ పర్యటన పురస్కరించుకుని మూడో రోజు బోన్ పట్టణంలో జర్మన్ ప్లాంట్ బ్రీడర్స్ అసోసియేషన్, యూరప్ విత్తన కంపెనీల ప్రతినిధులతో మంత్రి నేతృత్వంలో బృందం ప్రత్యేక సమావేశమైంది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి, ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు పాల్గొన్నారు. అభివృద్ది చెందుతున్న దేశాల విత్తన పరిశ్రమలతో పోటీపడుతూ భారత్ 15 వేల కోట్ల విలువ కలిగి ఉండి ఆసియా ఖండంలో అత్యున్నత స్థానంలో ఉందని జర్మన్ ప్లాంట్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కొనియాడారు. ఆసియా ఖండపు ప్రాంతీయ విత్తన భాండగారంగా తీర్చిదిద్దే క్రమంలో తెలంగాణ ముఖ్య పాత్ర పోషించాలని సూచించింది. భారత్‌లో ధాదారణ పంటల విత్తనోత్పత్తిలో కాకుండా కూరగాయ పంటల విత్తనోత్పత్తిలో మంచి అవకాశాలు ఉన్నాయి అభిప్రాయపడింది. విత్తన చట్టాలు, నాణ్యతా నియంత్రణ విధానం మెరుగుపరచి విత్తన పరిశోధనపై కూడా మరింత దృష్టి సారించడంతోపాటు ప్రత్యేక విత్తనోత్పత్తి జోన్లు ఏర్పాటు చేసి, డిజిటల్ టెక్నాలజి వినియోగించాలని జర్మన్ ప్లాంట్ బ్రీడర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. తెలంగాణలో విత్తన రంగ అభివృద్దికి ఎన్నో సంస్కరణలు చేపట్టామని జర్మన్ ప్లాంట్ బ్రీడర్స్ అసోసియేషన్, యూరప్ విత్తన కంపెనీల ప్రతినిధులకు మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు. ఓఈసీడీ అంతర్జాతీయ విత్తన ధృవీకరణ ద్వారా విత్తన ఎగుమతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదారాబాద్‌లో ఇస్టా విత్తన పరీక్ష ల్యాబ్ ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. గత జూన్ నెలలో ఆసియా ఖండంలోనే మొదటి సారి 800 మంది విదేశీ విత్తన ప్రముఖులతో అంతర్జాతీయ ఇస్టా విత్తన సదస్సు నిర్వహించామని మంత్రి పేర్కొన్నారు. VIS...........
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.