ETV Bharat / state

ఫలితాలు చూసి రైతులే ముందుకొస్తారు: నిరంజన్​ రెడ్డి

author img

By

Published : May 14, 2020, 7:29 PM IST

పండించిన పంట అమ్మకం, గిట్టుబాటు ధర విషయంలో ఎలాంటి చింతా లేకుండా చేయడమే సమగ్ర వ్యవసాయ విధాన ప్రధాన ఉద్దేశమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. వర్షాకాలంలో వరి, యాసంగి నుంచి అన్ని పంటలకు నియంత్రిత విధానంలో సాగుదిశగా చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన... ఈ వర్షాకాలంలో రైతులందరికీ రైతుబంధు సాయం అందుతుందని స్పష్టం చేశారు. ఫలితాలు చూసి రైతులే నియంత్రిత సాగుకు ముందుకొస్తారని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ విధానం దేశానికే కాకుండా ప్రపంచానికే దారి చూపుతుందంటోన్న వ్యవసాయశాఖ మంత్రితో మా ప్రతినిధి రఘువర్ధన్ రెడ్డి ముఖాముఖి.

ఫలితాలు చూసి రైతులే ముందుకు వస్తారు: నిరంజన్​ రెడ్డి

సమగ్ర వ్యవసాయంలో భాగంగా నియంత్రిత విధానంలో సాగు అంటున్నారు. అసలు ఉద్దేశం ఏంటి? ఏం చేయబోతున్నారు ?

దేశంలో అత్యధికమంది ఆధారపడిన రంగం వ్యవసాయం. వ్యవసాయ సాగు భూమి ఎక్కువగా ఉన్న రెండో దేశం భారతదేశం. వ్యవసాయ ఉత్పత్తుల్లో చైనా, అమెరికా ముందున్నాయి. చైనాలో మనకంటె వరి, ఇతర పంటలు ఎక్కువగా పండుతున్నాయి. ఆహార కొరత ఉన్న స్థితి నుంచి వ్యవసాయ ఉత్పత్తులు మిగులు ఉన్న పరిస్థితికి వచ్చాం. అవసరానికి మించి వ్యవసాయ ఉత్పత్తులు వస్తున్నాయి. ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. కానీ రైతుకు మాత్రం సరైన ధర లభించడం లేదు. పండ్లు, పాలలో ప్రపంచంలోనే భారతదేశం మొదటిస్థానంలో ఉంది. అయితే ఈ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి వినియోగించడంలో రెండు శాతం కూడా లేదు. ఉత్పత్తి చేశాక ఎంతగా నష్టపోతున్నామో అర్థం చేసుకోవచ్చు. ప్రాసెసింగ్, విలువ పెంచడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత కీలకం. అది జరగాలంటే నాణ్యమైన ఆహార ఉత్పత్తులు రావాలి. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలి. మార్కెటింగ్ ఇంటెలిజెన్స్, అవసరాలపై సమగ్ర అంచనా ఉండి అందుకు అనుగుణంగా సాగు జరిగితే పంటలకు గిట్టుబాటు ధరే కాకుండా రైతులకు లాభసాటిగా కూడా ఉంటుంది. అందుకే సమగ్ర వ్యవసాయ విధానం తీసుకొస్తున్నాం. ఉన్న స్థితి నుంచి మెరుగైన స్థితికి రైతులు వెళ్లేందుకు దారి చూపేందుకు ప్రయత్నిస్తున్నాం.

ఇక నుంచి ప్రభుత్వం చెప్పిన పంటలు మాత్రమే వేయాలా..?

శాసనంగా కాదు. రైతాంగానికి మేలు జరిగేలా సూచనప్రాయమైన ఆదేశాలు ఉంటాయి. నియంత్రిత వ్యవసాయాన్ని యాసంగిలో పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. వర్షాకాలంలో ఎక్కువగా వరి సాగు చేస్తారు. మొత్తం పండే పంటను అంచనా వేసుకున్నాం. స్థానిక, ఇతర రాష్ట్రాల అవసరాలు తీసుకున్నాం. 6.2-6.4 మిల్లీమీటర్ల పొడవుండే బియ్యానికి అంతర్జాతీయ డిమాండ్ ఉంది. ఆ వంగడాలను శాస్త్రవేత్తలతో అభివృద్ధి చేయించాలి. అన్ని అంశాలపై సమగ్ర కసరత్తు చేసి రైతాంగానికి దిశానిర్ధేశం చేస్తాం. మార్కెట్ గ్యారంటీ లేని పంటలు వేసి ప్రభుత్వం కొనాలన్న పరిస్థితి కల్పిస్తే ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. కరోనా విపత్కర పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడరాదన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. కానీ.. ప్రతిసారి కొనుగోలు చేయదు. ప్రభుత్వం రైతులకు మంచి సూచనలు, సలహాలు ఇచ్చి సహాయకారిగా ఉంటుంది. రైతులకు ప్రత్యామ్నాయ దారి చూపేందుకే సమగ్ర వ్యవసాయ విధానం తీసుకొస్తున్నాం. ఈ విధానం తెలంగాణకే కాదు దేశానికే తలమానికంగా, మార్గదర్శకంగా ఉంటుంది.

వర్షాకాలంలోనే నియంత్రిత విధానంలో సాగు అంటున్నారు. రైతుబంధు, కనీస మద్ధతు ధరకు సంబంధించి ఏం చెప్తారు.?

ఈ వర్షాకాలంలో రైతులందరికీ రైతుబంధు సాయం అందుతుంది. ఎలాంటి సంశయం, అపోహలకు తావు లేదు. వరిలో ఎక్కువ సన్నాలు వేయండి. మార్కెట్లో గిట్టుబాటు ధర ఉంటుందని రైతులకు చెప్తాం. ఇతర పంటలు యథాతథంగా వేసుకోవచ్చు. యాసంగిలో వరిని తగ్గించి ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు రైతాంగాన్ని మళ్లించడం పైనే మా ప్రధాన దృష్టి. ఆయా ప్రాంతాల్లో పండించే పంటలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంటుంది. వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాల్లో పండించే వేరుశెనగకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. యాసంగిలో ప్రస్తుతం రెండున్నర లక్షల ఎకరాలకు పండిస్తున్నారు. దాన్ని క్రమంగా పది లక్షల ఎకరాలకు తీసుకెళ్తాం. అంటే యాసంగిలో ఆరేడు లక్షల ఎకరాల వరిని తగ్గించినట్లవుతుంది. రైతులకు మంచి ధర కూడా వస్తుంది. ఆవాలు, నువ్వులు, కుసుమలు తదితర నూనెగింజలకు కూడా భారీ డిమాండ్ ఉంది. ఆయిల్ పామ్​ను ఐదు నుంచి పది లక్షల ఎకరాలకు విస్తరించాలన్న లక్ష్యం పెట్టుకున్నాం. కోతులు, అడవి పందుల బెడద ఉండదు. ఏం చేసినా నిర్ధిష్టమైన ధర, కచ్చితమైన లాభం ఉండే పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి. చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లలోనూ ఎక్కువ ఉన్నవి తగ్గించుకొని, తక్కువ ఉన్నవి పెంచుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా దృష్టి సారిస్తాం. ఇప్పుడు ప్రణాళిక రూపొందిస్తున్నాం. యాసంగికి పూర్తి స్థాయిలో అమలవుతుంది. వర్షాకాలంలో సన్న రకాలు వేయడం ద్వారా దారి పట్టిచ్చే ప్రయత్నం చేస్తాం. అనుభవాలతో రెండో, మూడో పంట వరకు రైతులే నియంత్రిత సాగుకు ముందుకొచ్చి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారన్నది మా నమ్మకం.

లాభసాటిగా ఉంటాయని చాలా మంది రైతులు వాణిజ్యపంటలు, ఉద్యానవన పంటలు పండిస్తుంటారు. వాటి విషయంలో ఏం చేస్తారు.?

వాణిజ్య, ఉద్యానవన పంటలను పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తాం. ఆ ఉత్పత్తుల ప్రాసెసింగ్, విలువ జోడించడంపై దృష్టి సారిస్తాం. ఉత్పత్తితో పాటు మార్కెటింగ్, ప్రాసెసింగ్ ఎగుమతుల సంబంధిత అంశాలన్నీ కూడా సమగ్ర వ్యవసాయ విధానంలో అంతర్భాగం అవుతాయి.

రైతులకు అవగాహన ఎలా కల్పిస్తారు. కార్యాచరణ ఎలా ఉండబోతోంది.?

మొదటి దశలో ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు దృశ్యమాధ్యమ సమీక్ష ద్వారా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులకు ప్రభుత్వ ఉద్దేశం, ఆలోచనలను వివరిస్తారు. వేల కోట్లతో నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్నాం. దేశంలోనే ఆదర్శంగా వ్యవసాయరంగాన్ని తీసుకెళ్తున్నాం. ఈ పరిస్థితుల్లో పంట పండించడం సమస్య కాదు, పండించిన పంట మార్కెటింగ్ కావాలి, వినియోగం కావాలి. ఆ దిశగా కసరత్తు జరగాలి. రైతులు అధిక పంటలు పండించి కూడా రైతులు బాధపడాల్సిన అవసరం లేదు. తిండిగింజలకు ఎదురుచూసిన పరిస్థితి నుంచి గ్రామగ్రామాన ధాన్యపు రాశులు చూసే పరిస్థితి వచ్చింది. పంటలన్నీ కూడా ఆహారఉత్పత్తులుగా ఇతర రాష్ట్రాలు, దేశాలకు పోయే స్థితిని కల్పించడం ముఖ్యం సవాల్. సీఎం కేసీఆర్ దీన్ని సవాల్ గా తీసుకున్నారు. వందశాతం విజయవంతం చేస్తారు. ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం చేపట్టినా సందేహాలు, అనుమానాలు పరిపాటే. కానీ.. కేసీఆర్ చేపట్టిన అన్ని నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా నిలిచి దారి చూపాయి. సమగ్ర వ్యవసాయ విధానం కూడా దేశానికే కాదు ప్రపంచానికే దారి చూపే గొప్ప విధానం అవుతుంది.

పరిశోధనలు, యాంత్రీకరణ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన వినియోగ విషయంలో ఏం చేస్తారు?

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐసీఎంఆర్ వ్యవసాయ పరిశోధనల ఫలితాలు రైతాంగానికి అందడం లేదు. దక్షిణ భారతదేశానికి కనీసం ప్రాతినిధ్యం కూడా లేదు. పరిశోధనలతో పాటు యాంత్రీకరణ, శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తేవాలి. ఈ విషయంలో కేంద్రం క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఆర్థికవేత్తలు వ్యవసాయ జీడీపీని 17శాతంగా చూపి పరిమితం చేయడం దురదృష్టకరం. వ్యవసాయాధారిత అన్ని రంగాలను పరిశీలిస్తే జీడీపీలో 42శాతం ఉంటుంది. జీడీపీ తక్కువగా చూపడం వల్లే కేంద్రం అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. రాష్ట్ర సమగ్ర వ్యవసాయ విధానం తర్వాత కేంద్ర విధానంలోనూ మార్పు వస్తుందని ఆశిస్తున్నాం.

క్షేత్రస్థాయిలో రైతులు కూలీల సమస్యను ఎదుర్కొంటున్నారు. సమగ్ర విధానంలో దీనికి సంబంధించి ఎలాంటి పరిష్కారం చూపుతారు?

యాంత్రీకరణే సమస్యకు పరిష్కారం. కానీ, మనషులు కూడా పనులు చేయాల్సి ఉంటుంది. ఉన్న వాళ్లకైనా పని కల్పించాలంటే ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానించాలని కేంద్రాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ఉపాధిహామీని అనుసంధానించకపోతే వ్యవసాయరంగం సంక్షోభంలో పడుతుంది. కరోనా వల్ల కూలీల కొరత బాగా ఏర్పడింది. మిర్చి, పత్తికోతకు మానవ శ్రమ అవసరం. పత్తి మొక్క ఒకేసారి పుష్పించి, పత్తి వచ్చే వంగడాలు తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

సమగ్ర వ్యవసాయ విధానం, నియంత్రిత సాగుకు సంబంధించి రైతులకు రెండు మాటల్లో ఏం చెప్తారు.?

రైతులు పంటను అమ్ముకునేందకు ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండకూడదు. పంటకోసం పెట్టిన ఖర్చుకు, రావాల్సిన ఆదాయం కోసం చింత చెందాల్సిన పరిస్థితి ఉండకూడదు. ఈ రెండింటిని అధిగమించడం కోసమే సమగ్ర వ్యవసాయ విధానం.

ఇవీ చూడండి: 'ఇద్దరు సీఎంలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.