ETV Bharat / state

Top News: టాప్​న్యూస్​ @7AM - undefined

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

ETV bharat Top ten news
Top News: టాప్​న్యూస్​ @7AM
author img

By

Published : Aug 1, 2022, 6:59 AM IST

  • మాదాపూర్‌లో కాల్పుల కలకలం..

హైదరాబాద్ మాదాపూర్‌లో తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇస్మాయిల్ అనే వ్యక్తిని సోమవారం తెల్లవారు మూడు గంటల సమయంలో ముజీబ్ అనే వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

  • బాసర ట్రిపుల్‌ ఐటీకి నిధుల కొరత..

బాసర ట్రిపుల్‌ ఐటీకి నిధుల కొరత పట్టిపీడిస్తోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులను సాంకేతిక రంగంలో మెరికలుగా మార్చాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన విద్యాసంస్థకు మౌలిక వసతుల కల్పన పట్టిపీడిస్తోంది. సర్కార్‌ ఇచ్చే నిధులు వేతనాలకే సరిపోడవంతో.. అధికారులు ఏం చేయలేని పరిస్థితి. ఇటీవల విద్యార్థుల ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపినా ఇప్పటికీ ప్రభుత్వం రెగ్యులర్‌ ఉపకులపతిని నియమించకపోవడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

  • ఏమ'నాలా' ?.. అదే ముంపు.. అదే ముప్పు..!

వానాకాలం వచ్చిందంటేనే రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో జనం వణికిపోతున్నారు. జలవనరులు, నాలాల సమీప ప్రాంతాల్లోని వందల కాలనీల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద నీటి కాలువలు సక్రమంగా లేకపోవడం.. నాలాల్లోనే వాననీరు వచ్చి చేరడం, ఆక్రమణలు, అసంపూర్తి పనులు వెరసి ముంపు కష్టాలు రెట్టింపవుతున్నాయి.

  • ఆనకట్టల నిర్వహణపై అలసత్వం..

వేల ఎకరాల ఆయకట్టు, లక్షల మందికి తాగునీటి వసతి కల్పించే ప్రాజెక్టుల నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. పాత ప్రాజెక్టుల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటంతో ఒకదాని వెంట మరొకటి ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎప్పటికప్పుడు పాతవాటికి చేయాల్సిన మరమ్మతులపై అధికారులు ఉదాసీనంగా వ్యవహారిస్తున్నారు. దీంతో కడెం, కుమురం భీం, వట్టివాగు ఆనకట్టలు ప్రమాదకరస్థితికి చేరుకున్నాయి.

  • ఎన్​ఐఏ అదుపులో ఇద్దరు

NIA at Armoor: నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్‌లో ఇద్దరు అనుమానిత వ్యక్తులను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. ఇవాళ ఉదయం పట్టణంలోని జిరాయత్​నగర్​లో సోదాలు నిర్వహించిన ఎన్​ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు.

  • 'ఆ డబ్బు నాది కాదు.. నాపై కుట్ర'

Partha chatterjee news: నటి, మోడల్‌ అర్పితా ముఖర్జీ ఇంట్లో బయటపడిన డబ్బు తనది కాదన్నారు బంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ. తనపై ఎవరు కుట్ర చేస్తున్నారో కాలమే సమాధానం చెబుతుందన్నారు.

  • దేశంలో తొలి మంకీపాక్స్ మరణం!

Monkeypox india death: మంకీపాక్స్ లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మరణించాడు. కేరళలోని త్రిస్సూర్‌ జిల్లాలో శనివారం 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్‌ లక్షణాలతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు.

  • హిట్లర్‌ వాచీ వేలం.. రూ.కోట్లలో పలికిన ధర

జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌కు చెందినదిగా భావిస్తున్న ఓ చేతి గడియారం తాజాగా ఓ వేలంలో 1.1 మిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.8.71 కోట్లు) అమ్ముడుపోయింది. అమెరికాలో నిర్వహించిన ఈ ప్రక్రియలో ఓ అజ్ఞాత వ్యక్తి దీన్ని సొంతం చేసుకున్నట్లు వేలం సంస్థ 'అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్' వెల్లడించింది.

  • వెయిట్‌లిఫ్టింగ్‌లో మరో పసిడి

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. తాజాగా వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో స్వర్ణాన్ని అందించారు. వెయిట్‌లిఫ్టింగ్‌ 73 కిలోల కేటగిరీలో అచింత షూలి పసిడి సాధించాడు.

  • మాధవన్‌, నంబి నారాయణన్‌కు సత్కారం

Rajinikanth madhavan: ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త, పద్మభూషణ్‌ నంబి నారాయణన్‌ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చినందుకు మాధవన్‌ను ప్రశంసించారు సూపర్​స్టార్ రజినీకాంత్​. అనంతరం ఆయన్ను, నంబి నారాయణన్‌ను రజినీకాంత్‌ శాలువాతో సత్కరించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.