ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@1PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP ten news in Telugu
TOP ten news in Telugu
author img

By

Published : Sep 5, 2020, 1:00 PM IST

1. మంత్రి హరీశ్‌రావుకు కరోనా

మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ట్విట్టర్‌లో మంత్రి వెల్లడించారు. ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. ఇటీవల తనను కలిసినవారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని హరీశ్‌రావు సూచించారు. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

2. బావ త్వరగా కోలుకుంటారు..

ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావుకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఈ మేరకు ట్విట్టర్​లో ఆయనే స్వయంగా తెలిపారు. అయితే దీనిపై స్పందించిన కేటీఆర్​... హరీశ్​రావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్​లో 'త్వరగా కోలుకోండి బావ.. మీరు అందరి కంటే త్వరగా కోలుకుంటారంటూ.. పోస్ట్​ చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

3. తహసీల్దార్​ కారు అడ్డగించిన రైతు

భూ సమస్యను పరిష్కరించాలని నాగర్​ కర్నూల్ జిల్లా లింగాల మండల తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లిన రైతుకు తహసీల్దార్‌ వాహనం తగలటం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భూ సమస్య పరిష్కరించమని వెళితే.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన తహసీల్దార్​ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

4.బైక్‌ బోట్‌ను తయారుచేసిన మెకానిక్‌ శంకర్‌

సాంకేతికంగా ఉన్నత చదువులు చదువుకోకపోయినా ఓ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేశాడు. తన వృత్తికే సృజనాత్మకత జోడించి.. మత్స్యకారుల కష్టాలు తీర్చేందుకు తనవంతు ప్రయత్నం చేశాడు. చెరువుల్లో చేపలు పట్టేందుకు ద్విచక్రవాహనంతో కూడిన చిన్నపాటి బోట్‌ తయారుచేసి... ప్రత్యేకత చాటుకున్నాడీ ఈ మెకానిక్‌.పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

5. గ్యాస్​ పైప్​లైన్ పేలి​ 12 మంది మృతి

బంగ్లాదేశ్​లో శుక్రవారం రాత్రి జరిగిన గ్యాస్​ పైప్​లైన్​ పేలుడులో 12 మంది మరణించారు. నారాయణ్‌గంజ్‌లోని బైతుస్ సలాత్‌ జామే మసీదులో ప్రార్థనలు ముగించుకొని.. బయటకు వస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో 27 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

6. పాఠశాలలో బాంబు కలకలం!

మధ్యప్రదేశ్​ భిండ్​ జిల్లాలో బాంబు కలకలం రేపింది. మేహ్​గావ్​లోని టీడీఎస్​ పాఠశాలలో బాంబు ఉన్నట్లు గుర్తించారు సిబ్బంది. బాంబ్​ డిస్పోసల్​ స్క్వాడ్​ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

7. ఐదుగురిని అపహరించిన చైనా ఆర్మీ!

అరుణాచల్ ప్రదేశ్​లో ఐదుగురు వ్యక్తులను చైనా ఆర్మీ అపహరించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే నిన్నాంగ్ ఎరింగ్ సంచలన ఆరోపణలు చేశారు. మాస్కోలో భారత్‌-చైనా రక్షణమంత్రుల సమావేశం జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగిందన్నారు. చైనాకు తగిన సమాధానం ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

8. 10.4 లక్షల మందికి ఉద్యోగాలు!

అమెరికా ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది. గత ఆగస్టులో 10.4 లక్షలకుపైగా కొత్త ఉద్యోగాలు వచ్చాయి. ఆ దేశ నిరుద్యోగ రేటు 1.8 శాతం మేర క్షీణించి 8.4 శాతానికి పడిపోయింది. ఒబామా-బైడెన్​ పాలన కాలంలో ఒక నెలలో వచ్చిన కొత్త ఉద్యోగాల సంఖ్యకు ఇది 2.5 రెట్లు అధికమని అధ్యక్షుడు ట్రంప్​ కమ్యూనికేషన్​ డైరెక్టర్​ తెలిపారు.పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

9.' ఈసారి ఆర్సీబీ కప్ గెలుస్తుంది'

తమ అభిమానుల కోసమైనా సరే ఈసారి కప్పు కొడతామని చెప్పాడు పేసర్ ఉమేశ్ యాదవ్. అందుకోసం బాగా కష్టపడుతున్నట్లు తెలిపాడు. సెప్టెంబరు 19 నుంచి టోర్నీ మొదలు కానుంది.పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

10. మా గురువులే నిజమైన హీరోలు..

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ట్వీట్లు చేసిన పలువురు సినీ ప్రముఖులు.. తమ గురువులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.