ETV Bharat / state

Telangana Top News టాప్​న్యూస్​ 11AM - టాప్​న్యూస్​ 11AM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

Telangana Top News
టాప్​న్యూస్​ 11AM
author img

By

Published : Aug 17, 2022, 11:00 AM IST

  • పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

Godavari water level గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో 54.6 అడుగుల నీటిమట్టం ఉంది. దీనితో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ప్రస్తుతం 15.08 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.

  • తెలంగాణ ఆర్టీసీకి కాసులపంట

TSRTC Income in August సంస్థను నష్టాల్లోంచి గట్టించేందుకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్తోంది. ఆగస్టు ఛాలెంజ్‌ పేరుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితాన్ని ఇస్తోంది. ఈనెలలో రోజువారీ ఆదాయం 20 కోట్ల రూపాయలకు చేరాలని పెట్టుకున్న లక్ష్యాన్ని ఆర్టీసీ చేరుకుంది. రాఖీ పండుగ, తగ్గించిన టీ24 టికెట్లతో ఆర్టీసీకి భారీ ఆదాయం చేకూరింది.

  • హైదరాబాద్​లో 2 గంటలపాటు ఉచిత ప్రయాణం

వజ్రోత్సవాల సందర్భంగా ప్రవేశ పెట్టిన ఓ పథకాన్ని టీఎస్​ఆర్టీసీ కొనసాగించాలని నిర్ణయించింది. ప్రయాణికుల వద్ద ఆ చీటీ ఉంటే... రెండు గంటల పాటు ఉచిత ప్రయాణం చేయవచ్చు. హైదరాబాద్​ పరిధిలో ఎక్కడివరకైనా ఉచితంగా చేరుకోవచ్చు. అసలు విషయం ఏమిటంటే...

  • ఎత్తిన జెండాలను ఏం చేద్దాం

జాతీయ జెండా ఎగరవేయాలన్నా, అవనతం చేయాలన్నా అనేక నియమాలు పాటించాల్సిందే. పంద్రాగస్టు ముగియడంతో నగర వాసులలో ఆ నిబంధనల అమలుపై ఆందోళన నెలకొంది. ఇప్పుడు వాటిని నిబంధనల ప్రకారం కనిపించకుండా చేయడం సవాలుగా మారింది. మరీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

  • భారత్​లో కొత్తగా 9 వేల కరోనా కేసులు

INDIA COVID CASES: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా 9,062 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. 36 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 15,220 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.56 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.25 శాతానికి చేరాయి.

  • ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు, ఏం జరిగింది

ఒకే ఇంట్లో ఆరుగురు విగతజీవులుగా కనిపించడం కలకలం రేపింది. జమ్మూలోని సిధ్రా ప్రాంతంలోని బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టు ​మార్టం నిమిత్తం మృతదేహాలను జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాలు, ఆస్పత్రికి తరలించారు.

  • తాజ్​ ఎక్స్​ప్రెస్​లో​ బాంబు కలకలం

Taj Express ఉత్తర్​ప్రదేశ్​ మథురాలో తాజ్​ ఎక్స్​ప్రెస్​లో బాంబు కలకలం రేగింది. తాజ్​ ఎక్స్​ప్రెస్​లో బాంబు ఉన్నట్లు ఓ వ్యక్తి కాల్​ చేసి బెదిరించాడు. అధికారులు అప్రమత్తమై రైలులోని ప్రయాణికులందరిని కిందకు దించి తనిఖీలు చేశారు.

  • వాణిజ్య పన్నుల రాబడిలో 15% పెరుగుదల

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ రాబ‌డి వృద్ధిరేటు.. గ‌త ఏడాది కంటే 15 శాతం అధికంగా న‌మోదైంది. ఈ ఆర్థిక సంవ‌త్సరంలో జులై నెలాఖ‌రు వ‌ర‌కు 22 వేల 657 కోట్లు ఆదాయం వచ్చింది. గ‌త ఏడాది కంటే ఈసారి 2 వేల 891 కోట్లు అధికంగా రాబ‌డి వ‌చ్చింది. ఈ ఆర్థిక ఏడాది వాణిజ్య ప‌న్నుల శాఖ ద్వారా 69 వేల 203 కోట్లు రాబ‌డిని అంచ‌నా వేయ‌గా... జులై నెలాఖ‌రు వ‌ర‌కు 22 వేల 657 కోట్లు ఆదాయం వ‌చ్చింది. రాష్ట్ర ఖజానాకు కీలక ఆదాయం వాణిజ్య పన్నులశాఖ ద్వారానే సమకూరుతోంది. ప్రధానంగా జీఎస్టీ, పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం అమ్మకం పన్ను ద్వారా ఆదాయం వస్తోంది.

  • ఆమిర్​, అక్షయ్​ను నిఖిల్​ దెబ్బకొట్టాడుగా

యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కార్తికేయ 2. పలుమార్లు వాయిదాలు పడిన ఈ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్​ హిట్​ టాక్​ను సంపాదించుకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సినిమా అత్యధిక వసూళ్లతో దూసుకెళ్తోంది. అయితే దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో కృష్ణుడి ఆరాధన ఎక్కువ కనుక బీటౌన్​ ప్రేక్షకులకు సినిమా తెగ నచ్చేసిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • పెళ్లిపీటలెక్కనున్న జబర్దస్త్ బ్యూటీ

పెళ్లి చూపులు రియాలిటీ షోతో బుల్లితెరపై సందడి చేసిన యువ నటి షబీనా షేక్. 'నా పేరు మీనాక్షి', 'అత్తారింటికి దారేది', 'కస్తూరి' సీరియల్‌తో ప్రత్యేక గుర్తింపు సాధించిన ఆమె.. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోతో మరింత పాపులర్​ అయింది. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న ఈ బ్యూటీ.. ఫోటోలను ఇన్​స్టాలో షేర్​ చేసింది. ప్రస్తుతం అవి సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.