ETV Bharat / state

Telangana News Today టాప్​న్యూస్​ 9AM - ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

Telangana News Today
టాప్​న్యూస్​ 9AM
author img

By

Published : Aug 17, 2022, 8:59 AM IST

  • కూలీలపై పడిన పిడుగు, నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లింగపాలెం మండలం బోగోలులో అర్ధరాత్రి దాటిన తర్వాత పిడుగుపడి నలుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని విజయవాడలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జామాయిల్‌ కర్రలు తొలగిస్తుండగా కూలీలపై పిడుగు పడినట్లు సమాచారం. నలుగురి మృతదేహాలను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ ఆస్తులు ఎంతో తెలుసా

Kishan Reddy Family Assets కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన వ్యక్తిగత, కుటుంబ ఆస్తులు, అప్పులను ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించారు. కిషన్ రెడ్డి కుటుంబ ఆస్తులు 2022 మార్చి 31 నాటికి రూ.22.54 కోట్లుగా, అప్పులు రూ.1.59 కోట్లుగా ఉన్నాయి. 2021 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నాటికి కుటుంబ ఆస్తుల విలువ రూ.4.34 కోట్ల మేర పెరగగా, అప్పులు రూ.7 లక్షల మేర తగ్గాయి.

  • పిల్లలో ఒత్తిడి తగ్గిస్తే జంక్‌ఫుడ్‌కి దూరం అవుతారట

పిల్లల్లో ఒత్తిడికి వారు తినే ఆహారానికి అవినాభావ సంబంధం ఉందని, ఎక్కువ ఒత్తిళ్లు ఎదుర్కొనే చిన్నారులు జంక్‌ఫుడ్‌ అధికంగా తీసుకుంటున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. జర్నల్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ బిహేవియర్‌లో ముద్రితమైన ఈ అధ్యయనం ప్రకారం ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయంలో పిల్లలు తీసుకునే ఆహార పదార్థాల్లో 40 శాతం వరకూ స్వీట్లు, పేస్ట్రీ కేకులు ఉంటున్నాయి.

  • అంకాపూర్ నాటుకోడి కూర, అమెరికా చేరి

ankapur desi chicken చుట్టూ పచ్చని పంటచేలు.. నగరాన్ని తలపించేలా అందమైన భవనాలతో కొలువుదీరిన అంకాపూర్‌ వ్యవసాయంలో ఎంత పేరు తెచ్చుకుందో అదే స్థాయిలో నాటుకోడి కూరను వండటంలో పేరుగాంచింది. ఇతర చోట్ల ఎక్కడ తిన్నా ఈ రుచి రాదు. మరి అంకాపూర్‌ నాటుకోడి స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి.

  • కాంగ్రెస్​కు అజాద్​ షాక్​, పార్టీ ఆఫర్​ తిరస్కరణ

Ghulam nabi azad news కాంగ్రెస్​ అగ్రనేత గులాం నబీ అజాద్​ ఆ పార్టీకి షాక్​ ఇచ్చారు. జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా సోనియా గాంధీ అప్పగించిన బాధ్యతలను గులాంనబీ ఆజాద్ తిరస్కరించారు. ఆజాద్ సన్నిహితుడైన వికార్ రసూల్‌ వానీని జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా నియమించారు. అయితే నియమించిన కొద్ది సేపటికే ఆఫర్‌ను ఆజాద్‌ తిరస్కరించారు.

  • ఘోర రైలు ప్రమాదం, 53 మందికి గాయాలు

Train Accident Today: మహారాష్ట్రలోని గోందియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఛత్తీస్​గఢ్​ బిలాస్​పుర్​ నుంచి రాజస్థాన్​ జోధ్​పుర్​కు వెళ్తున్న భగత్​ కి కోఠీ ప్యాసింజర్​ ట్రైన్​.. ఓ గూడ్స్​ ట్రైన్​ను ఢీకొట్టింది. దీంతో మూడు బోగీలు పట్టాలు తప్పగా 50 మందికిపైగా గాయపడ్డారు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు.

  • ఈ ఏడాది వేతనాల్లో 10% పెంపు, ఆసియా పసిఫిక్​లోనే అత్యధికం

ఆసియా పసిఫిక్​లోనే అత్యధిక వేతనాలు చెల్లించే దేశంగా భారత్​ నిలవబోతుంది. భారత్‌లోని కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం 10 శాతం మేర వేతన పెంపును చేపట్టవచ్చని అంతర్జాతీయ సలహా, బ్రోకరేజీ కంపెనీ విలిస్‌ టవర్స్‌ వాట్సన్‌ చేపట్టిన శాలరీ బడ్జెట్‌ ప్లానింగ్‌ నివేదిక అంచనా వేస్తోంది.

  • భారత ఫుట్‌బాల్‌పై పెద్ద బాంబు, ప్రపంచకప్‌ ఆతిథ్యానికి దూరం

స్వాతంత్య్ర అమృత మహోత్సవాల వేళ భారత ఫుట్‌బాల్‌పై పెద్ద బాంబు పడింది. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యను ఫిఫా నిషేధించింది. ఇది దేశ ఫుట్‌బాల్‌కు తీరని మచ్చగా మిగిలిపోనుంది. ఓ వైపు గత స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆటలో ఘన కీర్తిని సాధించాలనే ప్రతిజ్ఞలు హోరెత్తుతున్న వేళ.. ఈ పరిణామం దేశ క్రీడా రంగానికి పెద్ద షాక్‌.

  • ఉత్కంఠగా హైవే ట్రైలర్, శర్వానంద్​ మూవీ నుంచి కొత్త పాట

ఆనంద్‌ దేవరకొండ, మానస జంటగా కె.వి.గుహన్‌ తెరకెక్కించిన హైవే చిత్రానికి సంబంధించిన ట్రైలర్​ను హీరో నాగశౌర్య విడుదల చేశారు. మరోవైపు, హీరో శర్వానంద్​, రీతూ వర్మ జంటగా రూపొందిన ఒకే ఒక జీవితం సినిమా నుంచి కొత్త పాట రిలీజ్​ చేశారు మేకర్స. వాటితో పాటు మరికొన్ని కొత్త సినీ అప్డేట్లు మీకోసం

  • కొత్త మూవీ కోసం మహేశ్​ మేకోవర్​, ఎన్టీఆర్​ ఫిజికల్​ ట్రైనర్​తో

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ శ్రీనివాస్​ దర్శకత్వంలో సూపర్​స్టార్​ మహేశ్​బాబు​ చేయనున్న కొత్త సినిమా షూటింగ్ తాజాగా మొదలయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ మూవీకోసం మహేశ్​ తన మేకోవర్‌పై దృష్టిపెట్టారు. ఇందులో ఆయన కొత్త లుక్‌లో కనిపిస్తారని సమాచారం. హెయిర్‌స్టైల్‌తోపాటు, ఫిజికల్‌గానూ కొత్తగా కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.