ETV Bharat / state

రైతుల పాలిట కొంగుబంగారం.. పోషకాహార లోపానికి ఈ వరి సమాధానం - ఐఎస్‌ఎం రకం వరి వంగడం

Fortified Rice: దేశంలో రైతు సంక్షేమం దిశగా... వరి సాగు విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. వాతావరణ మార్పులు, పెరుగుతున్న జనాభా నేపథ్యంలో ఆహార భద్రత నుంచి పౌష్టికాహార భద్రత వైపు భారత వ్యవసాయ పరిశోధన మండలి అడుగులు వేస్తోంది. ప్రతికూల పరిస్థితులు తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే పంటల వైపు రైతులను తీసుకెళ్తోంది. వారి ఆదాయాలు పెంచే క్రమంలో కొత్త వంగడాలను రూపకల్పన చేస్తోంది. పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ఐసీఏఆర్, భారతీయ వరి పరిశోధన సంస్థ- ఐఐఆర్‌ఆర్‌... పార్టిఫైడ్ రైస్ వరి వండగాలకు రూపకల్పన చేసింది. బలవర్థకమైన పార్టీఫైడ్ రైస్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల కింద అందుబాటులోకి తీసుకురానున్నాయి. 2024 నాటికి దేశవ్యాప్తంగా ఈ ఆహార ధాన్యాలను సరఫరా చేయాలని కేంద్రం సంకల్పించింది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు ఈ రకం ద్వారా ఆదాయాల పెంపు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా శాస్త్రవేత్తలను వరి రకాలను రూపకల్పన చేశారు. మరి, పార్టీఫైడ్‌ రైస్‌ గురించి మరిన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

fortified rice
fortified rice
author img

By

Published : Nov 7, 2022, 2:57 PM IST

రైతుల పాలిట కొంగు బంగారం.. పోషకాహార లోపానికి ఈ వరి సమాధానం

Fortified Rice: భారత దేశంలో పండే అతి ముఖ్యమైన పంటల్లో వరి ఒకటి. ఇది దక్షిణ భారతీయుల ముఖ్యమైన ఆహారం. భారతదేశంలో ఉన్న 50 శాతం పంట భూములలో వరి పండిస్తున్నారు. ప్రపంచంలో సగం జనాభాకు ముఖ్యమైన ఆహారం వరి అన్నమే. ఇప్పటికీ దేశంలో 70 శాతం జనాభాకు వరి అన్నం తినడం అలవాటు. ఒకప్పుడు భారత్‌ వరి పంటలో విదేశాలపై ఆధారపడింది. కానీ, ప్రస్తుతం అదే వరి ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్‌ ఎదిగింది.

హైదరాబాద్ రాజేంద్రనగర్ భారతీయ వరి పరిశోధన సంస్థ-ఐఐఆర్ఆర్, ఉప్పల్‌లోని సెంటర్ ఫర్ మాలిక్యులర్ బయోలజీ సంస్థ శాస్త్రవేత్తలు సంయుక్తంగా కొన్ని రకాల వంగడాలను అభివృద్ధి చేశారు. దీని సాగుకు రైతులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో భాగంగా 50.9 జీఐతో ఐఎస్‌ఎం రకం వరి వంగడంకు మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా రైతు దినోత్సవం పేరిట ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంప్రూవ్డ్‌ సాంబ మసూరి సహా ఇతర పార్టిఫైడ్ వరి వంగడాల ప్రత్యేకతలపై తెలుగు రాష్ట్రాల రైతులతోపాటు వ్యవసాయ శాఖ, ప్రభుత్వ, ప్రైవేటు విత్తన సంస్థలకు తెలియజేశారు.

భారత దేశంలో వరి 44 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంది. తద్వారా 121 మిలియన్ టన్నుల ఉత్పత్తి నమోదవుతోంది. విదేశీ ఎగుమతుల ద్వారా ఏటా 70 వేల కోట్ల రూపాయలు ఆదాయం లభిస్తోంది. ప్రపంచంలో వరి సాగులో భారత్ అగ్రస్థానంలో ఉండగా... ఉత్పత్తిలో చైనా అగ్రస్థానంలో ఉంది. పంట ఉత్పత్తిలో భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. పెరుగుతున్న జనాభా దృష్ట్యా... రానున్న కాలంలో వరి అధిక దిగుబడి సామర్థ్యం పెంపొందించడం చాలా అవసరం. అందుకోసం 1989 నుంచి హైబ్రీడ్ వరి రకాల ఉత్పత్తి చేపట్టింది ఐసీఏఆర్.

అధిక ఉష్ణోగ్రత తట్టుకుని అధిక దిగుబడి ఇచ్చే విధంగా.. 1959 నుంచి 1970 మధ్య కాలంలో రూపొందించిన మొదటి అధిక దిగుబడి ఇచ్చే జయ వరి వంగడం దేశంలో పలు ప్రాంతాల్లో రైతులు ఎంతో ఆసక్తిగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అది దాదాపు 2 నుంచి 2.5 లక్షల హెక్టార్లలో సాగులో ఉంది. వాతావరణ వైపరీత్యాల నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రత తట్టుకుని అధిక దిగుబడి ఇచ్చే విధంగా డీఆర్‌ఆర్‌ ధాన్ 47, డీఆర్‌డీఆర్‌ ధాన్ 52 రకాలు రూపొందించారు. అగ్గి తెగులు, ఎండాకు తెగులు ఒకేసారి తట్టుకునే విధంగా జన్యువులు జొప్పించి డీఆర్‌ఆర్‌ ధాన్ 62 అనే నూతన రకం వంగడం విడుదల చేశారు శాస్త్రవేత్తలు.

దేశవ్యాప్తంగా... ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న గింజ నాణ్యత కలిగిన వరి వంగడాల్లో సాంబ మసూరి - బీపీటీ 5204 ప్రధానమైంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన ఈ రకం బహుళ ప్రాచుర్యం పొందింది. ఈ వంగడం అధిక దిగుబడి, గింజ నాణ్యత గుణగణాలపై రైతులకు అవగాహన ఉంది. అయితే, దీనిలో ముఖ్యంగా ఎండాకు తెగులు తట్టుకునే శక్తి లేకపోవడం వల్ల ఐఐఆర్ఆర్... సీసీఎంబీ కలిసి ఆధునిక పద్ధతులైన జన్యు మార్పిడి ద్వారా ఎక్స్‌ ఏ 21, ఎక్స్‌ ఏ 13, ఎక్స్‌ ఏ 5 జన్యువులు సాంబమసూరి వంగడంలో పొందుపరిచి ఎండాకు తెగులు తట్టుకునే శక్తిని పెంపొందించారు. దీనిని 2007లో విడుదల చేశారు.

మొట్టమొదటి ప్రభుత్వ రంగ ఏరోబిక్ వరి వంగడం.. ఇది కాకుండా డీఆర్‌ఆర్‌హెచ్‌ 3 అధిక దిగుబడి వచ్చే సంకర జాతి వరి రకం. ఈ పంట 130 రోజుల్లో కోతకు వస్తుంది. అలాగే, డీఆర్‌ఆర్‌హెచ్‌ 4 అనే ఆరుతడి పద్ధతిలో నీటి ఎద్దడి పరిస్థితుల్లో నేరుగా విత్తుకోవడానికి అనువుగా తయారు చేసిన మొట్టమొదటి ప్రభుత్వ రంగ ఏరోబిక్ వరి వంగడం. పంట 120 రోజుల్లో కోతకు వస్తుంది. ప్రత్యేకించి అక్షయధాన్ - డీఆర్‌ఆర్‌ ధాన్ 35, వరధాన్ - డీఆర్‌ఆర్‌ ధాన్ 36, సంపద-డీఆర్‌ఆర్‌ ధాన్ 37, డీఆర్‌ఆర్ ధాన్ 39 నుంచి 69 వరకు విడుదల చేసి దేశపురోభివృద్ధిలో తన సత్తా చాటుతోంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వివిధ పరిశోధన సంస్థలతో అనుబంధం ఏర్పాటు చేసుకుని అనేక ప్రశంసలు పొందుతుండటం పట్ల రైతులు, నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గత 57 సంవత్సరాల్లో ఐసీఏఆర్, ఐఐఆర్ఆర్ సమన్వయ పరిశోధనల ద్వారా 1445 అధిక దిగుబడి ఇచ్చే నూతన వరి రకాలు, 135 సంకర జాతి వరి రకాలు కలిపి మెుత్తం 1580 రకాలను విడుదల చేశారు. అన్నదాత సేవలో ఒకపక్క సమన్వయ పరిశోధనలు, మరోపక్క శాస్త్రవేత్తల కృషి ద్వారా ఇప్పటి వరకు 69 అధిక దిగుబడినిచ్చే నూతన వరి వండగాలు, 4 సంకర జాతి వంగడాలు రూపొందించారు. తెలుగు రాష్ట్రాల్లో అధిక శాతం ప్రజలు ఎక్కువగా భుజించే వరి బియ్యం రకాల్లో సాంబమసూరి - బీపీటీ 5204 పురాతనమైంది. రకరకాల పేర్లతో సాంబమశూరి లేదా సోనా మశూరిగా వ్యాపారులు వినియోగదారులకు విక్రయించడం పరిపాటి. ఈ అద్భుత వంగడానికి బీపీటీ రకం అని నామకరణం చేశారు.

ఐఎంస్‌ రకం రైతుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తోంది.. ఈ బియ్యంతో వండిన అన్నం సన్నగా, నాణ్యంగా ఉండటం, రుచి ఉండటం వల్ల ఇప్పటికీ అన్ని వర్గాల ప్రజలు ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. కానీ, ఇందులో ఐజీ 52.99 శాతం ఉన్నందువల్ల మధుమేహులు తింటే శరీరంలో చక్కర స్థాయి మరింత పెరుగుతున్నాయి. అందువల్లనే ఎక్కువ మంది రాత్రి పూట అన్నం మానేసి చపాతీలు లేదా పుల్కాలు తినడం అధికమైంది. ఈ రకం సాగు చేసినప్పుడు పంటకు ఎండాకు తెగులు అధికంగా వచ్చి 40 శాతం వరకూ నాశనమయ్యేది. ఈ నేపథ్యంలో బీపీటీ - 5204 రకం మరింత అభివృద్ధి చేసి జీఐ శాతం తగ్గిస్తే అటు రైతులు, ఇటు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు. దేశంలో తొలిసారిగా మార్కెట్ యాడెడ్ ఎంపిక విధానంలో ఎండాకు, ఇతర తెలుగుళ్లు, చీడపీడలు తట్టుకునే ఎక్స్‌ఏ21, ఎక్స్‌ఏ13, ఎక్స్‌ఏ5 అనే 3 రకాల జన్యువులు కొత్తగా బాపట్ల సాంబమశూరి వంగడంలో చేర్చి అభివృద్ధిచేసిన ఐఎంస్‌ రకం రైతుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పౌష్టికాహార భద్రత వైపు శరవేగంగా అడుగులు.. భారత్‌ ఆహార భద్రత నుంచి పౌష్టికాహార భద్రత వైపు శరవేగంగా అడుగులు వేస్తోంది. ఆహార భద్రత సుస్థిరమవుతున్న దశలో ఇకపై పౌష్టికాహార లోపం కూడా ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అదే లక్ష్యంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం, ప్రజా పంపిణీ వ్యవస్థ కింద బియ్యం... ఇలా దశలవారీగా అన్ని సంక్షేమ పథకాల ద్వారా బలవర్థక ఆహారం సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. 2024 నాటికి దేశవ్యాప్తంగా ఈ బలవర్థక ఆహార ధాన్యాలు సరఫరా చేయాలని సంకల్పించింది. తొలి విడతగా ఇప్పటికే పలు పథకాల కింద పార్టిఫైడ్ బియ్యం పంపిణీ ప్రారంభవగా... 2022 లోపు ఆహార భద్రత చట్టం పరిధిలోని లబ్ధిదారులందరికీ ఈ ఫార్టిఫైడ్ రైస్ సరఫరా చేయాలన్నది కేంద్రం నిర్దేశించింది. ఇందుకు 35 లక్షల టన్నుల ఫార్టిఫైడ్ రైస్ అవసరం అవుతుంది. రెండో విడతగా 175 లక్షల టన్నుల ఫార్టిఫైడ్ బియ్యం 291 బ్లాక్‌లకు సరఫరా చేయాలన్నది లక్ష్యం. ఈ నేపథ్యంలో ప్రధాన ఆహార పంట వరి విస్తృత పరిశోధనల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు మరో హరిత విప్లవానికి ముందడుగు పడింది. రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులు, ప్రకృతివైపరీత్యాలు సమర్థవంతంగా తట్టుకునే వరి సాగుతో రైతు శ్రేయస్సుకు పాటు పడటమే ధ్యేయంగా తాము విశిష్టకృషి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.