ETV Bharat / state

దైవ దర్శనాలకు అనుమతిస్తాం : మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి - MINISTER INDRAKARAN REDDY latest news

సోమవారం నుంచి దేవాలయాల్లోకి భక్తులను అనుమతించనున్నారు. ఇష్టదైవాలను దర్శించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. కరోనా వైరస్​ నేపథ్యంలో దేవాలయాల వద్ద తీసుకుంటున్న జాగ్రత్తల గురించి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

ETV BHARAT INTERVIEW WITH MINISTER INDRAKARAN REDDY
'దర్శన భాగ్యానికి ఏర్పాట్లు పూర్తి.. జాగ్రత్తలు పాటించాల్సిందే'
author img

By

Published : Jun 5, 2020, 6:16 PM IST

'దర్శన భాగ్యానికి ఏర్పాట్లు పూర్తి.. జాగ్రత్తలు పాటించాల్సిందే'
  • దాదాపు రెండున్నర నెలల తర్వాత దేయాలయాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఆలయాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?

సోమవారం నుంచి దేవాలయాలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. కేంద్రం సూచించిన మేరకు సీఎం కేసీఆర్ ఆలయాలను తెరవాలని నిర్ణయించారు. ఈ మేరకు దేవాదాయశాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. భక్తులకు తగిన భౌతిక దూరం పాటిస్తూ క్యూలైన్లు ఏర్పాటు చేశాము. సోడియం హైపోక్లోరైట్​ ద్రావణంతో ఆలయం శుభ్ర పరచడం, ప్రవేశద్వారం దగ్గర శానిటైజర్‌లు అందుబాటులో ఉంచాల‌ని అధికారుల‌ను ఆదేశించాము. ఆల‌యానికి వ‌చ్చే భక్తులు భౌతిక‌ దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధ‌రించ‌డం త‌ప్పనిస‌రి చేశాము. ఆరోగ్యసేతు అప్లికేషన్​ను డౌన్​లోడ్ చేసుకోవాలని కూడా భక్తులకు సూచిస్తాము. ప్రతి ఒక్కరి శరీర ఉష్ణోగ్రతను పరిశీలించేందుకు థర్మల్​గన్స్ ఏర్పాటు చేస్తున్నాము. శానిటైజర్లతో ప్రత్యేక స్టాండ్లు కూడా ఉంటాయి. అన్ని జాగ్రత్తలతోనే ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తాము.

  • రాష్ట్రంలో చాలా దేవాలయాలున్నాయి. ప్రముఖ దేవాలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారు?

వేములవాడ, బాసర, భద్రాచలం, యాదగిరిగుట్ట లాంటి ఆలయాలకు భక్తులు కాస్త ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఆయా దేవాలయాల్లో కల్యాణాలు, బాసరలో అక్షరాభ్యాసం కోసం వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తాము. కంటైన్మెంట్​ జోన్లలో ఉన్న ఆల‌యాల్లోకి భ‌క్తుల‌కు ప్రవేశం లేద‌ు.

  • తీర్థప్రసాదాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నారు?

భక్తులకు తీర్ధప్రసాదాలు ఇవ్వడం, శ‌ఠ‌గోపం లేదు. పుష్కరిణిలో స్నానాల‌కు అనుమ‌తి లేదు. అంత‌రాల‌య ద‌ర్శనం, వ‌స‌తి సౌక‌ర్యాలు ఉండ‌వు. ఆల‌యాల వ‌ద్ద ఉన్న విక్రయ కేంద్రాల ద్వారా ‌ప్రసాదాలు పొంద‌వ‌చ్చు. ప్రముఖ దేవాలయాలకు సంబంధించి ఆన్​లైన్ బుకింగ్ సేవ‌లు య‌థావిధిగా అందుబాటులో ఉంటాయి.

  • భక్తులకు అవగాహన కలిగేంచేలా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?

ఆలయం వెలుపల, పరిసర ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేస్తాం. ప్రతి భక్తుడు మాస్కు ధరించాల్సిందే. 65 ఏళ్లు పైబ‌డిన వారు, 10 ఏళ్ల లోపు పిల్లలు, క‌రోనా వ్యాధి ల‌క్షణాలు ఉన్నవారు ఆల‌య ద‌ర్శనాల‌కు రావ‌ద్దు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించాము.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.