Anu Acharya Interview : అతి తక్కువ ధరల్లో జీనోం స్టడీ.. నీతి ఆయోగ్ అవార్డు గ్రహీత అనూ ఆచార్య
మనం కాస్త జాగ్రత్తగా ఉంటే బీపీ, షుగర్ ఇలాంటి వ్యాధులు దరిచేరకుండా కాపాడుకోవచ్చు. క్యాన్సర్ లాంటి మహమ్మారులను తొలిదశలో గుర్తిస్తే ప్రాణాలు పోకుండా నిలపవచ్చు. ఇలా ఒకటేమిటి అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలను ముందే చెప్పేదే జెనెటిక్ స్టడీ. మనుషుల జీన్స్‌ని పరీక్షించటం ద్వారా వారికి భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు వచ్చే ముప్పు ఉందని ముందే గుర్తించవచ్చు. ఫలితంగా మెరుగైన జీవితాన్ని ఆస్వాదించే అవకాశం ఉందంటున్నారు మ్యాప్ మై జీనోమ్ సంస్థ వ్యవస్థాపకురాలు అనూ ఆచార్య. విదేశాల్లో జెనెటిక్స్ చదివిన అను.. భారత్‌లో మ్యాప్ మై జీనోమ్ సంస్థని స్థాపించి ప్రజలకు అతి తక్కువ ధరల్లోనే జీనోం స్టడీని అందుబాటులోకి తీసుకువచ్చారు. తాను చేస్తున్న కృషికి గాను ఇటీవల నీతి అయోగ్ ఇచ్చే ఉమెన్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో అనూ అచార్యతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
మ్యాప్ మై జీనోమ్ సంస్థ వ్యవస్థాపకురాలు అనూ ఆచార్య