ETV Bharat / state

సిమెంట్‌, స్టీలు ఇంతగా పెరగడానికి కారణాలు ఇవే? - telangana news updates

స్టీల్‌, సిమెంట్‌, ఎలక్ట్రికల్‌ కేబుల్‌, పీవీసీ పైపులతో పాటు అన్ని రకాల ముడి సామగ్రి ధరలు భారీగా పెరిగాయి. నిర్మాణ వ్యయం ఇటు బిల్డర్లను, అటు కొనుగోలుదార్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సొంతింటి కల.. ఖరీదైపోతోంది. ధరల పెరుగుదలతో ఒక్కసారిగా చదరపు అడుగుపై 800 నుంచి 1000 రూపాయల వరకు అదనపు భారం పడుతోంది. నిర్మాణ ముడి సామగ్రి ధరల పెరుగుదల ప్రభావం స్థిరాస్తి రంగం అనుబంధ వ్యాపారాలపైనా తీవ్రంగా పడుతోంది. రీటైల్‌ ధరలు మరింత పెరిగి సామాన్యులకు అందనంత ఎక్కువగా ఎగబాకాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుదల, బొగ్గు కొరత లాంటి పరిణామాలు నిర్మాణ రంగాన్ని కుదిపేస్తున్నాయి. కొవిడ్‌ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది నిర్మాణ రంగం ధరల పెరుగుదల ప్రభావంతో... కొనుగోలుదారులు ముందుకురారేమోనన్న ఆందోళనలు బిల్డర్లల్లో మొదలయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపించి ధరలు స్థిరీకరిస్తే తప్ప ధరల పెరుగుదలకు కళ్లెం పడదంటున్న... క్రెడాయ్ జాతీయ ఉపాధ్యక్షుడు గుమ్మిరామిరెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

ETV bharat interview
ETV bharat interview
author img

By

Published : Oct 29, 2021, 8:38 AM IST

క్రెడాయ్ జాతీయ ఉపాధ్యక్షుడు గుమ్మిరామిరెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి
  • సిమెంట్‌, స్టీలు ధరలు భారీగా పెరిగాయి...వాటి ప్రభావం నిర్మాణ రంగంపై ఎలా ఉండబోతుంది?

కొవిడ్‌ ముందు నుంచి చూసుకుంటే నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగింది. కొవిడ్‌కు ముందు టన్ను స్టీలు 40వేలు నుంచి 42వేలు ఉండేది. ఇప్పుడు రూ.65వేలకు పెరిగింది. మొదటి రకం స్టీలు అయితే ఏకంగా రూ.75వేలు వరకు ఉంది. ఇది చాలా చాలా దారుణం. చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా 5 టన్నులు స్టీలు పట్టిందనుకుంటే లక్ష నుంచి లక్షా 25వేల రూపాయిలు అదనంగా భారం పడుతోంది. సిమెంటు కూడా వంద నుంచి 125 రూపాయిలు పెరిగింది.

  • ఉన్నఫలంగా స్టీలు ఇంతగా పెరగడానికి కారణాలు ఏమిటి ?

బొగ్గు కొరత ప్రభావం విద్యుత్తు ఉత్పత్తిపై పడుతోంది. అది నిజం. కానీ బొగ్గు ధరలతో సమానంగా స్టీల్‌ ధరలు పెరగడం సరికాదనిపిస్తోంది. బొగ్గు కొరత కారణంగా ఇంత పెద్ద ఎత్తున ప్రభావం లేదు. స్టీల్‌ ధర పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం ఏదొకటి చేయకుండా ఇలా చూస్తూ పోతే ఎలా అని ప్రశ్నించారు. నిర్మాణాలకు చెందిన ప్రతి ముడి సరుకు ధర పెరిగింది. ల్యాండ్‌ డెవలప్‌మెంటుకు తీసుకుని చేస్తున్న బిల్డర్లపై... చదరపు అడుగుకు 800 నుంచి వెయ్యి రూపాయిలు వరకు అదనపు భారం పడుతోంది.

  • చదరపు అడుగుకు 800 నుంచి 1000 అదనపు భారం పడుతుందంటున్నారు. ఆ భారం అంతా కొనుగోలుదారులపై వేస్తారా లేఖ బిల్డర్లు కొంత భరించే అవకాశం ఉందా ?

కొనుగోలుదారులపై ఒకేసారి అంత భారం వేస్తే అమ్మడం కూడా కష్టం. చదరపు అడుగు నాలుగైదువేలుగా ఉంటే... దానిని ఏడు వేలకు అమ్మాలంటే కుదరదు. బిల్డర్‌కు ఇబ్బంది ఉంటుంది. కానీ బిల్డర్‌ కూడా కొంత భరించాల్సిందే.

  • స్టీల్‌, సిమెంట్‌ ధరల పెరుగుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారా ?

ధరల పెరుగుదల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి చాలా సార్లు తీసుకెళ్లాం. హామీలు వస్తున్నాయి కానీ... ఆచరణలోకి రావడం లేదు. బొగ్గు కొరత కారణంగానే ఇంత పెద్ద ఎత్తున స్టీలు ధరలు పెరిగాయని చెప్పడంలో అర్థం లేదు. నష్టపోతూ వ్యాపారం చేయాలని ఎవరు కోరుకోం. ఆ ప్రభావం ఇతర రంగాలపై తీవ్రంగా పడి నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. కానీ అది జరగడం లేదు. సిమెంట్‌కు, స్టీల్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకురావాలని ఇటీవల నితిన్‌ గడ్కరి పేర్కొన్నట్లు మీడియాలో చూశాను.

  • స్టీల్‌, సిమెంట్‌లకు ప్రత్యామ్నాయం తీసుకొచ్చేందుకు కేంద్రం చొరవచూపుతోంది అంటున్నారు... ప్రత్యామ్నాయం ఏముండొచ్చు ?

స్టీల్‌కు, సిమెంట్‌కు ప్రత్యామ్నాయ ఉత్పత్తులు ప్రయోగదశలో ఉన్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ఇంధనానికి కూడా ప్రత్యామ్నాయం తీసుకురావాలని బావిస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వాటి వల్ల రవాణా వ్యవస్థపై భారం పెద్ద ఎత్తున పడుతుంది. స్టీల్‌, సిమెంట్‌ ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం లోతైన అధ్యయనం చేసి..సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుని...ధరల నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది.

  • సిమెంట్‌, స్టీల్‌ ధరలతోపాటు ఇతర నిర్మాణ సామగ్రి ధరలు కూడా పెరిగాయని చెబుతున్నారు... ఏయే వస్తువులు ఎంత పెరిగాయి. ఆ ప్రభావం ఎలా ఉంది ?

నిర్మాణాలకు ఉపయోగించే ముడి సామగ్రి వస్తువుల ధరలన్నీ పెరిగాయి. టైల్స్‌ చూసుకుంటే చదరపు అడుగు రూ.45గా ఉండేది రూ.55కు పెరిగింది. ఇవి ఎక్కువగా గుజరాత్‌ నుంచి వస్తాయి. అక్కడ నుంచి రావాలంటే రవాణా ఛార్జీలు, ఉత్పత్తి ధరలు కూడా పెరిగాయి. పీవీసీ పైపులు 40శాతం, కాపర్‌ 40 నుంచి 50 శాతం వరకు పెరిగాయి. ప్లంబింగ్‌, శానిటరీ వేర్‌, ఎలక్ట్రికల్‌ ఇలా ప్రతిది ధరలు పెరిగాయి.

  • హైదరాబాద్‌లో గృహాల ధరలు 2శాతం వరకు పెరిగాయి....కొన్ని నగరాల్లో ధరలు పెరగలేదు..మరికొన్ని నగరాల్లో ధరలు తగ్గాయి..కారణం ఏంటి.

భారత దేశంలో చూసుకుంటే స్థిరాస్తి రంగంలో హైదరాబాద్‌ నగరానిది మొదటి స్థానం. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. ఫార్మా, ఐటీ, హెల్త్‌కేర్‌లో తదితర రంగాల్లో కూడా ఉన్నత స్థాయిలో ఉన్నాం. కొవిడ్‌ సమయంలో అయితే ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ వచ్చి ట్రీట్‌మెంట్‌ తీసుకుని వెళ్లారు. హైదరాబాద్‌ నగరం హెల్త్‌ సిటీలా మారింది. ఐటీ పరిశ్రమ విపరీతంగా అబివృద్ధి చెందింది. జాతీయ సగటు అభివృద్ది 8 శాతం ఉండగా....హైదరాబాద్‌ 18 నుంచి 19శాతం వృద్ధి నమోదు చేసుకుంది. ఇందువల్ల ఉపాది పెరుగుతోంది. పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారు. ఇళ్లకు డిమాండ్‌ పెరుగుతోంది. మొత్తం మీద ఇతర నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉంది.

  • గృహాల అమ్మకాలు ఎలా ఉన్నాయి. ఈ ధరల పెరుగుదల ప్రభావం కొనుగోలుదారులపై పడే అవకాశం ఉందా ?

అమ్మకాల్లో హైదరాబాద్‌ ముందుంది. కొనుగోలుదారులకు విజ్ఞప్తి చేస్తున్నా....యుడీఎస్‌ సేల్స్‌లో చాలా మంది కొంటున్నారు. ఆ డెవలపర్‌ ఫ్రొఫైల్‌ చూడకుండా...వాళ్లకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా... లేవా... అని చూడకుండా కొనకూడదు. ఇవాళ తక్కువ ధరకు వస్తున్నాయని కొనుగోలు చేశారంటే ఆ తరువాత ఆ ప్రాజెక్టు పూర్తి కాకుంటే కొనుగోలుదారుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితి దిల్లీలో జరిగింది. తొమ్మిది, పదేళ్లు ప్రాజెక్టు పూర్తి చేయకుండా వేలాది అపార్ట్​మెంట్లు ఉన్నాయి. ఎంతో మంది డెవలపర్లు జైలులో ఉన్నారు. తొందరపాటు నిర్ణయలు తీసుకుని కొనుగోలుదారులు ఇబ్బంది పడవద్దు. రెరా రిజిస్ట్రేషన్‌ ఉన్న ప్రాజెక్టుల్లోనే కొనుగోలు చేయాలని నా విజ్ఞప్తి.

  • అఫోర్డబుల్‌ గృహాల అమ్మకాలు హైదరాబాద్‌లో చాలా తగ్గుతున్నాయి...45లక్షలు లోపు విలువ ఇల్లు అమ్ముడు పోవడం లేదు. ఇందుకు కారణాలు ఏమిటి ?

అఫోర్డబుల్‌ గృహాల అమ్మకాలు తగ్గడం లేదు. 60 నుంచి 70 చదరపు మీటర్లు వైశాల్యం కలిగిన ఇళ్లను అఫోర్డబుల్‌ ఇల్లు అంటారు. రూ.45లక్షలకు అపార్టమెంట్లు రావడం కష్టమవుతోంది. ప్రధాన ప్రాంతాల్లో అపోర్డబుల్‌ ఇళ్లు లేవు. నగరానికి దూరంగా పోతే అఫోర్డుబుల్‌ ఇల్లు దొరుకుతాయి. వెయ్యి చదరపు అడుగులు తీసుకున్నా ఒక్కో చదరపు అడుగు అయిదువేలకు తక్కువ లేదు. కనీసం అంటే యాభై లక్షల రూపాయలు పెట్టాలి. ఇప్పుడు 50 లక్షల నుంచి 80 లక్షల వరకు ఖరీదు కలిగిన ఇళ్ల అమ్మకాలు జోరుగా ఉన్నాయి. విల్లాలకు మరింత డిమాండ్‌ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నగరంలో ఎక్కడా యాభైలక్షల లోపు ఆస్తి దొరకదు.

  • హైదరాబాద్‌లో కమర్షియల్ స్పేష్‌ సంవత్సరానికి ఎంత అందివ్వగలుగుతున్నారు. డిమాండ్‌ ఎలా ఉంది.?

కమర్షియల్‌ స్పేష్‌కు భారీగా డిమాండ్‌ ఉంది. ప్రతి సంవత్సరం మిలియన్ల చదరపు అడుగులు అందుబాటులోకి వస్తోంది. మొన్న నేను ఒక సర్వేలో చూశాను....ఏకంగా 80మిలియన్‌ చదరపు అడుగులు నిర్మాణానికి ప్రణాళికలు రూపకల్పన జరుగుతున్నట్లు. దేశంలో ఇతర నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లోనే బాగుంది. ఒకప్పుడు బెంగళూరులో బాగుండేది. ఇప్పుడు బెంగళూరుతో పోల్చుకుంటే హైదరాబాద్‌లోనే అభివృద్ధి ఎక్కువ ఉంది. క్రమంగా బెంగళూరుతో సమాన స్థాయికి హైదరాబాద్‌ వస్తోంది.

  • దేశంలోని మెట్రో నగరాల్లో స్థిరాస్తి వ్యాపారం ఎలా ఉంది...అమ్మకాలు ఎలా ఉన్నాయి ?

హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానంలో పుణె, బెంగళూరు, ముంబయి ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఎన్సీఆర్‌ (దిల్లీ) సాధారణ పరిస్థితుల్లోకి వచ్చింది. అహ్మదాబాద్‌ కూడా బాగుంది. ప్రతి నగరంలోనూ అభివృద్ధి ఉంది. మైనస్‌ గ్రోత్‌ అనేది లేదు. మొదటి దశ కొవిడ్‌ ముందు పరిస్థితులు చూసుకుంటే స్థిరాస్తి రంగం దేశవ్యాప్తంగా మెరగవుతోంది.

ఇదీ చూడండి: కోర్టుల్లో మౌలిక సదుపాయాలపై సీజేఐ కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.