.
F2F with IMD Director: "ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం" - వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్నతో ముఖాముఖి
అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. తెలంగాణ సగటు వర్షపాతం సాధారణం కన్నా 33శాతం అధికంగా నమోదైనట్లు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 113శాతం సాధారణం కన్నా అత్యధిక వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. రాగల నాలుగైదు రోజుల్లో బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్నతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్నతో ముఖాముఖి
.