రాష్ట్రంలో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆధునిక వైద్య సదుపాయాలతో నాచారంలో కొత్త ఈఎస్ఐ ఆస్పత్రిని త్వరలో అందుబాటులోకి తెస్తామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. నిర్మాణంలో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రి భవనంను ఈటల మంత్రి మల్లారెడ్డితో కలిసి సందర్శించారు. ఆస్పత్రిలో వసతులను, నిర్మాణ పనుల తీరును అడిగి తెలుసుకున్నారు.
"450 పడకల ఆధునాతమైన ఈ ఆస్పత్రి పూర్తికాబోతుంది. కార్మికుల ఆరోగ్యం కోసం ఆధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నాము. 15-20 రోజుల్లో వాడుకునే స్థాయికి వస్తుంది."
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
ఇదీ చూడండి : 'వానాకాలంలో పంట మార్పిడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'