Etela Rajender: ముఖ్యమంత్రి కేసీఆర్పై భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఎన్డీఏ, యూపీఏ కూటమి మినహా మరే ఇతర కూటమి దేశంలో రాణించలేవని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు పట్టించుకోకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఉద్యోగాలు వచ్చిన వాళ్లు.. రాని వాళ్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి రాష్ట్రంలో వచ్చిందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమకు ఓట్లేసి గెలిపించారనే అహంకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
వ్యక్తులు కాదు.. వ్యవస్థలు ముఖ్యం..
మేడారంలో గవర్నర్ను అవమానించారని ఈటల ఆరోపించారు. సంస్కారహీనమైన సంప్రదాయానికి కేసీఆర్ తెర తీశారని ఆరోపణలు చేశారు. సంస్కృతి, సంప్రదాయాలు గురించి మాట్లాడే కేసీఆర్.. సంస్కారం ఏపాటిదో అర్థమవుతుందన్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా స్వయంగా ప్రధాని మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారన్నారు. వ్యక్తులు కాదు.. వ్యవస్థలు ముఖ్యమని కేసీఆర్కు గుర్తుచేస్తున్నానన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు తాత్కాలిక విజయాన్ని మాత్రమే ఇస్తాయని కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. భాజపా కార్యకర్తలపై దాడులు కొనసాగుతాయన్న కేటీఆర్వి చిల్లర వ్యాఖ్యలని ఆయన విమర్శించారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి..
ప్రజాగ్రహం తప్పించుకోవడానికే కేసీఆర్ ముంబయి పర్యటనకు వెళ్లాడని ఈటల పేర్కొన్నారు. నోటిఫికేషన్లు లేకపోవడం వల్ల తెలంగాణ యువకులకు పెళ్లిళ్లు కావటం లేదన్నారు. ఉద్యోగ నియామకాలపై కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. వీఆర్వోలను తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. గతంలోనే ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి విఫలమయ్యారని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష పార్టీల సూచనలు తీసుకున్న సందర్భాలు లేవన్నారు. రాష్ట్రంలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు.
అందుకే ముంబయి వెళ్లారు..
జాతీయ పార్టీ లేకుండా.. ప్రాంతీయ పార్టీల కూటమి సాధ్యం కాదు. గతంలోనే ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి ప్రయత్నించారు.. విఫలమయ్యారు. ప్రజా ఆగ్రహం తప్పించుకోవడానికే కేసీఆర్ ముంబయి పర్యటనకు వెళ్లారు. ఇవాళ మళ్లీ ఇక్కడ సమస్యలు పరిష్కరించే సత్తా లేక నేషనల్ లెవెల్లో ప్రయత్నిస్తున్నారు. ఇంకా ప్రజానీకం అబద్ధపు ప్రచారాన్ని నమ్మే స్థితిలో లేరు. ప్రతిపక్ష పార్టీల సూచనలు తీసుకున్న సందర్భాలు లేవు.
-ఈటల రాజేందర్, భాజపా ఎమ్మెల్యే
ఇదీ చదవండి: