Etala Jamuna Comments On MLC Kaushik Reddy : హుజురాబాద్ ఎమ్మెల్సే ఈటల రాజేందర్‌ను చంపేందుకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని రాజేందర్ సతీమణి ఈటల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శామీర్‌పేటలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె.. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈటల రాజేందర్‌ను కౌశిక్ రెడ్డి రూ.20 కోట్లు ఇచ్చి చంపేస్తామని అన్నారని.. దీని వెనుక సీఎం కేసీఆర్ హస్తం ఉందని ధ్వజమెత్తారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని తెలంగాణ సమాజాన్ని ప్రశ్నించారు.
Kaushik Reddy Plan To Kill Etala Rajender Rs 20 Crore : ఈటల కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికి హాని జరిగిన సరే.. దానికి కేసీఆర్‌నే కారణం అవుతారని ఈటల జమున స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డి లాంటి శాడిస్టులను పార్టీలో పెట్టుకుని.. కేసీఆర్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఈటల రాజేందర్‌ను చంపేస్తామంటే ఇక్కడ ఎవరూ భయపడే ప్రసక్తే లేదని లేదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఓ పిచ్చి కుక్కను ఎమ్మెల్సీ చేసి హుజురాబాద్ మీద వదిలేశారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇలాంటి వారిని సీఎం స్వయంగా హుజురాబాద్ ప్రజలపైకి ఉసిగొల్పారని ధ్వజమెత్తారు.
"ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు కుడి భుజంగా ఉన్న ఈటల రాజేందర్‌ను రూ.20కోట్లకు చంపేందుకు రెడీగా ఉన్నామని చెప్పింది ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి. నయీం లాంటి వ్యక్తులు ఉద్యమం చేసినప్పుడు చంపేస్తామని బెదిరించారు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తులకు భయపడతామా. కేసీఆర్ చెప్పితేనే కదా ఈ ఎమ్మెల్సీ మాట్లాడేది. లక్షల కోట్లు సంపాదించి ఈ రోజు కేసీఆర్ తనకు అడ్డువచ్చిన వారిని చంపడానికి సిద్ధంగా ఉన్నారు." - ఈటల జమున, ఈటల రాజేందర్ భార్య
Etala Jamuna Sensational Comments On MLC Kaushik Reddy : కౌశిక్ రెడ్డి హుజురాబాద్‌లో అరాచకాలు సృష్టిస్తున్నారని ఈటల జమున ఆక్షేపించారు. హుజురాబాద్ టికెట్‌ను కౌశిక్ రెడ్డికి ప్రకటించిన తర్వాతనే.. తన ఆగడాలు ఎక్కువయ్యాయన్నారు. ఆయన ఆ నియోజకవర్గ ప్రజలను హింసిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీలో ఈటల రాజేందర్ సంతృప్తిగానే ఉన్నారని.. పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారని వెల్లడించారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని ఈటల రాజేందర్ భార్య జమున స్పష్టం చేశారు. ఈటలను చంపడానికి రూ.20కోట్లుతో కాదు.. ప్రజలు ఓటుతోనే కేసీఆర్‌కు బుద్ధి చెపుతారని ఈటల జమున అభిప్రాయపడ్డారు. అమరవీరుల స్తూపాన్ని తాకే అర్హతలేని కౌశిక్ రెడ్డి.. జేసీబీతో అమరుల స్మారకాన్ని కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కౌశిక్‌రెడ్డిపై డీజీపీకి ముదిరాజ్ ఐకాస ఫిర్యాదు : మరోవైపు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముదిరాజ్‌లను కించపరిచేలా మాట్లాడిన మాటలు పట్ల డీజీపీకి తెలంగాణ ముదిరాజ్ ఐకాస ఫిర్యాదు చేసింది. ఆ ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం దాఖలు చేసింది. మరోపైపు కౌశిక్ రెడ్డిపై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని ముదిరాజ్ ఐకాస తెలిపింది. ఈ ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించారన్నారు. వచ్చే ఎన్నికల్లో కౌశిక్ రెడ్డికి బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని.. సీఎం కేసీఆర్‌ను కోరారు.
ఇవీ చదవండి :