కొవిడ్-19 నివారణకు చర్యలను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. భాగ్యనగరం పాతబస్తీ ఛార్మినార్ సమీపంలోని నిజామియా జనరల్ వైద్యశాలలో 12 వార్డుల్లో 180 పడకలతో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా జ్వరం, జలుబు, తుమ్ములు వస్తున్న వారికి అలోపతి ద్వారా చికిత్స అందిస్తామని ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ తెలిపారు. అటెండర్లను లోనికి అనుమతించమని చెప్పారు. రోగుల అరోగ్య పరిస్థితి క్షీణిస్తే మెరుగైన వైద్యం కోసం తమ ఆస్పత్రి అంబులెన్స్‌లో ఇతర ఆసుపత్రికి తరలిస్తామన్నారు.
ఇవీచూడండి: 'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'