ETV Bharat / state

మంగళ్​ఘాట్​లో దివ్యాంగులకు సరకుల పంపిణీ

author img

By

Published : May 30, 2020, 11:55 AM IST

హైదరాబాద్ గోషామహల్ మంగళ్​ఘాట్ డివిజన్ పరిధిలో జననీ స్వచ్ఛంద సేవా సంస్థ, భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

Essential goods distribution to the handicaps at gaffanagarbasthi in goshamahal constituency
మంగళ్​ఘాట్​లో దివ్యాంగులకు సరుకుల పంపిణీ

హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గ పరిధి మంగళ్​ఘాట్ డివిజన్​లోని గఫ్ఫానగర్ బస్తీలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కొవిడ్-19 విజృంభిస్తోన్న నేపథ్యంలో జననీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సుమారు 35 కిట్ల కిరాణా సామగ్రి అందించారు. ఒక్కో కిట్​లో బియ్యం, కిలో కంది పప్పు , కిలో గోధుమ పిండి, చింతపండు, 2 డెటాల్ సబ్బులు, చక్కెర, టీ పౌడర్, కారం, పసుపు, ఇతర వంట సరుకులతో కలిపి మెుత్తం 16 రకాలను ఇచ్చారు.

అప్రమత్తంగా ఉండాలి..

లాక్​డౌన్ నేపథ్యంలో దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారని.. అందుకే వారి కోసం జననీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సామగ్రి పంపిణీ చేశామని సంస్థ కార్యదర్శి మల్లేశ్​, మంగళ్​ఘాట్ భాజపా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి నాగమణి బెస్త తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని నాగమణి కోరారు. హైదరాబాద్ మహా నగరంలో రోజురోజుకూ కరోనా కేసులు అధికంగా పెరుగుతుండటం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

మాస్క్ తప్పనిసరి..!

భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని జీహెచ్​ఎంసీ డీపీవో రాధారాణి సూచించారు. కార్యక్రమంలో గోషామహల్ భాజపా కన్వీనర్ కృష్ణ, డివిజన్ ప్రెసిడెంట్ బబ్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదీచూడండి: భాగ్యనగర వాసులు.. బహు ధైర్యవంతులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.