ETV Bharat / state

బయటపడ్డ ఈఎస్​ఐ కుంభకోణంలోని కీలక అంశాలు... - ఈఎస్​ఐ కుంభకోణం కేసులో కీలక అంశాలు

సంచలనం సృష్టించిన బీమా వైద్య సేవల మందుల కొనుగోలు కుంభకోణం వ్యవహారంలో కీలక అంశాలు వెలుగుచూశాయి. వైద్య కిట్లు, హెచ్​ఐవీ కిట్ల పేరిట కోట్ల రూపాయల నిధులు గోల్​మాల్​ చేసిన బాగోతం అనిశా దర్యాప్తులో బయటపడింది. ఈ వ్యవహారాన్ని మొత్తం దేవికారాణి జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే 16 మందిని జైల్లో పెట్టిన అధికారులు... ఎవరికెంత ముట్టిందనే దానిపై దృష్టి పెట్టారు.

ESI SCAM CASE UPDATE IN TELANAGANA
author img

By

Published : Oct 29, 2019, 9:35 PM IST

Updated : Oct 30, 2019, 6:17 AM IST

కార్మిక బీమా వైద్య సేవల సంస్థలో మందుల కొనుగోలు కుంభకోణం కేసులో కీలక అంశాలు బయడపడుతున్నాయి. ఔషధాలే కాకుండా ఏకంగా మెడికల్ కిట్ల పేరుతో భారీగా అవకతవకలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. 2017, 18లో కిట్ల కోసం కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. దేవికారాణి, ఇతర అధికారులు, బీమా వైద్య సేవల సంస్థ డైరెక్టరేట్‌ కార్యాలయం సిబ్బంది కుమ్మక్కై రూ.1.76 కోట్లు దండుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి మొత్తం 22 ఇండెంట్లు ఉండగా... వాటిలో అధికారులు రెండు ఇండెంట్లను పరిశీలించగా... ఈ వ్యవహారం బయటపడింది.

2 ఇండెంట్లకే ఇంతైతే... మరి 20 ఇండెంట్లకు...

హెచ్‌ఐవీ కిట్ల పేరుతో ఈ బాగోతానికి దేవికారాణి సూత్రధారిగా నడిపించినట్టు తేలింది. రెండు ఇండెంట్లలోనే ఇంత అక్రమం జరిగితే... మిగితా 20 ఇండెంట్లను పరిశీలిస్తే మరిన్ని వ్యవహారాలు బయటపడే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఇతర అధికారులు, కార్మిక బీమా వైద్య సేవల సంస్థ డైరక్టరేట్‌ కార్యాలయం సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. ఎవరెవరికీ ఎంత ముట్టిందనే విషయంపైనా అధికారులు దృష్టి సారించారు.

ఈ కేసులో అనిశా ఇప్పటికే 16 మందిని అరెస్టు చేసింది. నిందితులంతా... చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. విచారణ వేగవంతం చేసి.. మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు.

బయటపడ్డ ఈఎస్​ఐ కుంభకోణంలోని కీలక అంశాలు...

ఇవీ చూడండి: జీవితంలో రాణించలేనేమోనని​ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

TG_HYD_56_29_ESI_SCAM_UPDATE_PKG_3066407 REPORTER:K.SRINIVAS NOTE:ఫైల్‌ విజువల్స్‌ వాడుకోగలరు. ( )కార్మిక బీమా వైద్య సేవల సంస్థ (ఐఎంఎస్‌) మందుల కొనుగోలు కుంభకోణంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో అనిశా ఇప్పటికే 16 మందిని అరెస్టు చేసింది. వీరంతా చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా దేవీకారాణి ప్రధాన సూత్రదారిగా మెడికల్‌ కిట్ల పేరిట భారీగా నిధులు గోల్‌మాల్‌ చేసిన బాగోతం దర్యప్తులో బయటపడింది. అక్రమాల్లో ఇతర అధికారులు, సిబ్బంది పాత్రపైనా అనిశా లోతుగా ఆరా తీస్తోంది.....LOOOK V.O:కార్మిక బీమా వైద్య సేవల సంస్థలో మందుల కొనుగోలు కుంభకోణం కేసులో తవ్వే కొద్ది రోజుకో కొత్త వ్యవహారం బయటపడుతోంది. ఔషధాలే కాకుండా ఏకంగా మెడికల్ కిట్ల పేరుతో భారీగా అవకతవకలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. 2017,18లో కిట్ల కోసం కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. దేవికారాణి, ఇతర అధికారులు, బీమా వైద్య సేవల సంస్థ డైరెక్టరేట్‌ కార్యాలయం సిబ్బంది కుమ్మక్కై 1.76 కోట్ల రూపాయలు దండుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి మొత్తం 22 ఇండెంట్లు ఉండగా... వాటిలో అధికారులు రెండు ఇండెంట్లను పరిశీలించారు. దీంతో ఈ వ్యవహారం బయటపడింది. V.O:హెచ్‌ఐవీ కిట్ల పేరుతో ఈ బాగోతం దేవికారాణి సూత్రధారిగా నడిపించినట్టు తేలింది. ఇందుకు సంబంధించి 22 ఇండెంట్లు ఉండగా... వీటిలో రెండు ఇండెంట్లను ఏసీబీ పరిశీలించడంతో 1.76 కోట్ల రూపాయల నిధుల అవకతవకల వ్యవహారం వెలుగు చూసింది. మిగితా 20 ఇండెంట్లను పరిశీలిస్తే మరిన్ని వ్యవహారాలు బయటపడే అవకాశాలున్నాయి. ఇందులో ఇతర అధికారులు కార్మిక బీమా వైద్య సేవల సంస్థ డైరక్టరేట్‌ కార్యాలయం సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. ఎవరెవరికీ ఇందులో ఎంత ముట్టిందనే విషయం పైనే దర్యాప్తు చేస్తున్నారు. ఇండెంట్లలో రెండిటిని పరిశీలించగా అక్రమాలు బయటపడ్డాయి. మరో 20 ఇండెంట్లను పరిశీలిస్తే భారీగానే నిధుల గోల్‌మాల్‌ వ్యవహారం వెలుగు చూస్తుందని భావిస్తున్న అనిశా ఆ దిశగా విచారణను వేగవంతం చేసింది. E.V.O:త్వరలో మరింత మందిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.
Last Updated : Oct 30, 2019, 6:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.