ETV Bharat / state

మొన్న కేటీఆర్​.. నేడు ఎర్రబెల్లి.. పీఎం మోదీకి పోస్టు కార్డులు.. - ఎర్రబెల్లి పీఎం మోదీకి పోస్టు కార్డు పంపారు

Errabelli sent post card to Modi to cancel GST on handloom: మొన్న కేటీఆర్​.. నేడు ఎర్రబెల్లి దయాకర్​రావు ఏంటి మంత్రుల పేర్లు చెప్పుతున్నాను అనుకుంటున్నారా.. అదేనండి చేనేతపై కేంద్రం తెచ్చిన జీఎస్​టీని రద్దు చేయాలని కోరుతూ మొన్న మంత్రి కేటీఆర్​ ప్రధానికి పోస్టుకార్డు పంపిస్తే.. నేడు మంత్రి ఎర్రబెల్లి పంపారు.

Errabelli Dayakar Rao writes postcard to PM Modi to cancel 5% GST on handloom
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
author img

By

Published : Oct 24, 2022, 4:26 PM IST

Errabelli sent post card to Modi to cancel GST on handloom: చేనేతపై విధించిన జీఎస్‌టీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు ఆయన తరహాలోనే చేనేత రంగంపై విధించిన 5 శాతం జీఎస్‌టీ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖతో పాటు పోస్టుకార్డును సైతం రాశారు.

తన స్వహస్తాలతో రాసిన ఈ పోస్టు కార్డును మంత్రినే పోస్టు చేశారు. ఒకవైపు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సమర్థవంతమైన పాలన ద్వారా చేనేతలకు ప్రోత్సాహకాలు ఇచ్చి కార్మికులను ఆదుకుంటుంటే.. మరోవైపు, కేంద్రం మాత్రం నడ్డి విరిచేలా 5 శాతం జీఎస్‌టీ విధించడం చాలా అన్యాయం అని ఆక్షేపించారు. రాష్ట్రంలో చేనేతలకు చేయూత, బీమా వంటి వినూత్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే.. కేంద్రం ప్రభుత్వం చేనేత కార్మికులపై కక్ష కట్టిందని విమర్శించారు. దేశంలో కీలక వ్యవసాయం తర్వాత ప్రజలు ఎక్కువగా ఆధారపడిన రంగం చేనేత అని గుర్తు చేశారు. అలాగే, భారతదేశంలో ఎప్పుడూ, ఎక్కడా లేని విధంగా చేనేత రంగంపై విధించిన జీఎస్‌టీ ఇప్పటికైనా వెంటనే రద్దు చేయాలని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.

మొన్న కేటీఆర్ మోదీకి పోస్టు కార్డు పంపారు..​ అలాగే మొన్న చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు లక్షలాది ఉత్తరాలు రాయాలని తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. తానే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పోస్టుకార్డు రాశారు. చేనేత ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని పోస్టుకార్డులో కేటీఆర్ డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల సమస్యలను అనేక సందర్భాల్లో వివిధ వేదికల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ.. సానుకూల స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

చేనేత సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు తాను పలుమార్లు ప్రధానమంత్రికి స్వయంగా ఉత్తరాలు రాశానని మంత్రి చెప్పుకొచ్చారు. చేనేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. అవి చాలవన్నట్లు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేత ఉత్పత్తులపై పన్ను వేసిందని కేటీఆర్ విమర్శించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో అత్యంత కీలక ఉద్యమ సాధనంగా జాతిని ఏకతాటిపై నడిపించిన చేనేత వస్త్రాలపైనే పన్ను వేసిన తొలి ప్రధాని మోదీనేనని ధ్వజమెత్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.