ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇస్తాం : మంత్రి ఎర్రబెల్లి
ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇస్తాం : మంత్రి ఎర్రబెల్లి - minister Errabelli dayakar Rao
శాసన మండలిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలువురు శాసన మండలి సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పలు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యలపై ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి వివరణ ఇచ్చారు. తాగునీటి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించి.. ఇంకా ఎవరికైతే నల్లా కనెక్షన్ రాలేదో.. వారికి నల్లా కనెక్షన్ ఏర్పాటు చేస్తామన్నారు. మంచిర్యాల జిల్లాలోని కొమురంభీం ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ ద్వారా పెద్దమోతాదులో మున్సిపాలిటీలకు మంచినీరు అందిస్తున్నామని.. మున్సిపల్ కార్పోరేషన్ ద్వారా ఆయా ప్రాంతాలకు కావల్సిన మంచినీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలోని అన్ని ప్రాంతాలకు నల్లా కనెక్షన్ ఇచ్చి మంచీనీటి సౌకర్యం కల్పిస్తామని మంత్రి తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు నిధులు కేటాయించి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని.. ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీటి సమస్య లేకుండా చేయడమే సర్కారు లక్ష్యమని.. ఈ క్రమంలో చాలావరకు లక్ష్యాలు పూర్తి చేశామని మంత్రి తెలిపారు.
![ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇస్తాం : మంత్రి ఎర్రబెల్లి errabelli dayakar rao Replies In MLC Session](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8760872-768-8760872-1599806484088.jpg?imwidth=3840)
ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇస్తాం : మంత్రి ఎర్రబెల్లి
ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇస్తాం : మంత్రి ఎర్రబెల్లి
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,426 కరోనా కేసులు, 13 మరణాలు