ETV Bharat / state

Errabelli comments on central Govt : 'కేంద్ర ప్రభుత్వ పక్షపాత ధోరణి మరోమారు బట్టబయలైంది' - తెలంగాణ వార్తలు

Errabelli comments on central Govt : రాష్ట్రం పట్ల కేంద్రం పక్షపాత ధోరణి మరోసారి బట్టబయలైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. నేషనల్ రూరల్ డెవలప్​మెంట్ వాటర్ సప్లయ్‌ కార్యక్రమం కింద నాలుగేళ్లలో రూ.2,455 కోట్లు కేటాయించి రూ.311 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారని గుర్తు చేశారు. కేంద్రం నుంచి నయా పైసా సాయం లేకుండా మిషన్ భగీరథను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఎర్రబెల్లి అన్నారు.

Errabelli dayakar rao comments on central Govt, mission bhagiratha
కేంద్రం తీరుపై ఎర్రబెల్లి ఫైర్
author img

By

Published : Dec 15, 2021, 10:51 AM IST

Errabelli comments on central Govt : మిషన్ భగీరథకు నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వ పక్షపాత ధోరణి పార్లమెంట్ సాక్షిగా మరోమారు బట్టబయలైందని గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆక్షేపించారు. నేషనల్ రూరల్ డెవలప్​మెంట్ వాటర్ సప్లయ్‌ కార్యక్రమం కింద నాలుగేళ్లలో రూ.2,455 కోట్లు కేటాయించి రూ.311 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారన్న ఎర్రబెల్లి... అందులో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు.

తెలంగాణ పథకాలు కాపీ..

మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాన్ని అభినందిస్తూ అనేక అవార్డుల‌ను ఇచ్చిన కేంద్రం... కాపీ కొట్టి జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ప‌థ‌కాన్ని జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టిందన్నారు. అనేక రాష్ట్రాలు మిష‌న్ భ‌గీర‌థ తరహా పథకాన్ని అమలు చేస్తున్నాయన్న మంత్రి......రూ.19వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం ప‌ట్టించుకోలేదని ఆరోపించారు. భాజపా పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లో పనులు మొదలు పెట్టిన దశలోనే వందల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష మానుకొని తగిన నిధులు అందించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు

దార్శనికతో ముందుకు..

కేంద్రం నుంచి నయా పైసా సాయం లేకుండా మిషన్ భగీరథను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఎర్రబెల్లి అన్నారు. దార్శనికత, ముందుచూపుతో ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా సురక్షిత మంచినీటిని అందిస్తూ... రాష్ట్ర ప్రజల మన్ననలను పొందిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష మానుకొని తగిన నిధులు అందించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: political leaders support for realtors: స్థిరాస్తి వ్యాపారులకు ప్రజాప్రతినిధుల అండ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.