Latest Kitchen Tools in Telugu: మారుతున్న కాలానికి అనుగుణంగా మనం వంటింట్లో ఉపయోగించే వస్తువుల్లో చాలా మార్పులు వచ్చాయి. కొత్త వస్తువుల ద్వారా కిచెన్‌లో పనులు చాలా ఈజీగా, వేగంగా పూర్తవుతున్నాయి. చాలా మంది మహిళలు వంటింట్లోని పాత వస్తువులతో పాటు.. కొత్త వస్తువులను కూడా ఉపయోగించుకుంటున్నారు. అయితే, లేటెస్ట్గా వచ్చిన కొన్ని కిచెన్ టూల్స్ ఏంటో మీరు ఓ సారి చూసి.. వీలైతే కొనుగోలు చేయండి..!
సమోసాలు చేయడం ఇక ఈజీ : మనలో చాలా మందికి వేడి వేడి సమోసా అంటే చాలా ఇష్టం. ఈవెనింగ్ టైమ్‌లో ఎక్కువ మంది వీటిని ఇష్టంగా తింటుంటారు. అయితే, కొంతమంది తరచూ ఇంట్లో కూడా సమోసాలు చేస్తుంటారు. కానీ, కచ్చితమైన ఆకారంలో అవి రావు. అయితే, మీ ఇంట్లో 'ఎలక్ట్రిక్ సమోసా మేకర్' (Electric Samosa Maker) ఉంటే క్షణాల్లోనే పర్ఫెక్ట్ షేప్‌లో సమోసాలను చేసేయవచ్చు. ఈ సమోసా మేకర్‌కి నాన్‌స్టిక్ కోటింగ్ ఉండడంతో అవి పర్‌ఫెక్ట్‌గా వస్తాయి. పైగా వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేయకపోవడంతో ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. ఈ మేకర్ మీ ఇంట్లో ఉంటే పిల్లలకు అప్పటికప్పుడు వేడివేడిగా సమోసాలు చేసి పెట్టొచ్చు.
వేలికి రక్షణగా : బాదం, వెల్లుల్లిపాయలాంటివి పొట్టు తీయడం కాస్త కష్టమైన పనే. ఇక పిస్తా పప్పుల పైన ఉండే షెల్ తీయాలంటే ఎంత కష్టమో చెపక్కర్లేదు. కొన్నిసార్లు వాటి పొట్టు తీసేటప్పుడు అది గోరులోకి వెళ్లి బాధిస్తుంటుంది. అయితే, కిచెన్‌లో 'ఫింగర్ గార్డ్' (Finger guard) ఉంటే ఇలాంటి సమస్య ఉండదు. ఈ ఫింగర్ గార్డ్ స్టీల్‌తో తయారుచేసినది కాబట్టి పొట్టును ఈజీగా తీసేయొచ్చు. అంతేకాదు, కూరగాయలు కట్‌చేసేటప్పుడూ మన వేలికి రక్షణగా కూడా ఉంటుంది. ఇది బరువు తక్కువ కాబట్టి సౌకర్యంగానూ ఉంటుంది.
వేడినీళ్ల కుళాయి : కొన్నిసార్లు వంటింట్లో కూరగాయలు, పండ్లు వంటివి కడగాలన్నా, జిడ్డుపట్టి ఉన్న పాత్రల్నీ తోమాలన్నా వేడినీళ్లు అవసరమవుతాయి. ఇందుకోసం మీకు ఈ 'ఎలక్ట్రిక్ వాటర్ హీటింగ్ ట్యాప్' (Electric water heating tap) ఉపయోగపడుతుంది. దీన్ని ట్యాప్‌కు బిగిస్తే హాట్ వాటర్ వచ్చేలా చేయడంతోపాటు నీటి ఉష్ణోగ్రతను తెలిపే 'డిజిటల్ డిస్‌ప్లే' కూడా ఇందులో ఉంటుంది. మనకు కావాల్సినట్లుగా టెంపరేచర్ని సెట్ చేసుకునే వీలూ ఇందులో ఉంటుంది. కాబట్టి, ఎవరైనా సులభంగా వాడేయొచ్చు.
ఉల్లిపాయలు ఇలా కట్ చేయండి.. గిన్నెలు అలా కడగండి - ఈ సూపర్ టిప్స్ తెలుసా?
కిచెన్‌లో మీ పని ఈజీ చేసే చిట్కాలు - ఇవి పాటిస్తే మాస్టర్ చెఫ్ ఇక మీరే!